సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చదువు జీవితాలు, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందనే నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో ధనుష్ మ్యాథ్స్ టీచర్ బాలుగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సార్ మూవీ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా నిర్మాతలు, బయ్యర్లకు లాభాలను అందిస్తుంది. ఈ మూవీ నేటితో సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా పలు ప్రాంతాల్లో సార్ మూవీ మంచి కలెక్షన్ అందుకుంటోందని, మొత్తంగా ఈ మూవీతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ మంచి సక్సెస్ అందుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: