తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా వరుసగా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు 16 గంటల పాటు నాన్ స్టాప్ గా దాదాపు 1500 మందితో ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమా 1930-40ల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాకా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: