తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కాకుండా శేఖర్ కమ్ములతో కూడా మరొక సినిమా చేస్తున్నాడు ధనుష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక తెలుగు డైరెక్టర్ తో ధనుష్ వర్క్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఇటీవల శర్వానంద్ తో శ్రీకారం మూవీ తీసి మంచి పేరు అనుకున్న కిషోర్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ధనుష్ వర్క్ చేయనున్నారని, ఇటీవల కిషోర్ చెప్పిన కథ తనకు ఎంతో నచ్చడంతో ధనుష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈవార్త చక్కర్లు కొడుతుంది.దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/FgfmSpTZ1NA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/q0qLVcAOF94/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/n7XBnq6ZFms/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/k-Ft3GIvtWw/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)