కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పలు సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ సార్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దే మూవీస్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా చదువు జీవితాలు, ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుందనే నేపథ్యంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన సార్ మూవీ ఫిబ్రవరి 17 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో ధనుష్ మ్యాథ్స్ టీచర్ బాలుగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 95. 58 కోట్ల కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. నిర్మాత నాగ వంశీ , బాలయ్య కోసం సార్ ప్రత్యేకమైన షో ప్రదర్శించారు. ఈ చిత్రం చూసిన అనంతరం బాలయ్య దర్శకుడిని, నిర్మాతని, నటీనటుల్ని అభినందించి, ప్రశంసలు కురిపించినట్టు నిర్మాణ సంత సితార ఎంటర్టైన్ మెంట్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సార్ చిత్రం చూసి అభినందించిన బాలయ్య గారికి కృతజ్ఞతలనీ , మీ రెస్పాన్స్ చూసి మేము థ్రిల్ అయ్యామనీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: