తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతుంది. సంయుక్త మీనన్ కథానాయిక.సాయి కుమార్ తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సార్ ” మూవీ షూటింగ్ జనవరి 3వ తేదీ పూజాకార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ తో ముహూర్తం షాట్ తో ప్రారంభమయిన “సార్ ” మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయినట్టు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. తెలుగు భాషలో “సార్”, తమిళ భాషలో “వాతి “టైటిల్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: