వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తన డబ్బింగ్ సినిమాలకే ధనుష్ ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా తెలుగులో సినిమా చేస్తున్నాడు కాబట్టి ధనుష్ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. తాజాగా ఈ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. హైద్రాబాద్, నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో ఈ ఈవెంట్ ను జరపనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భరణి , నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: