తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెలుగులో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించిన సంగతి కూడా విదితమే. తెలుగులో సార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా తమిళ్ లో వాతి అనే టైటిల్ తో వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈసినిమాను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా: కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. నిర్మాత ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర తదితరులు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందచేశారు. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.
An Auspicious start to an Ambitious Journey of a common man♥️#Vaathi / #Sir took off today with a Pooja. Regular Shoot from 5th Jan!#SIRMovie @dhanushkraja @iamsamyuktha_ #VenkyAtluri @gvprakash @dineshkrishnanb @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/nefceHRqwq
— Sithara Entertainments (@SitharaEnts) January 3, 2022
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భరణి , నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: