కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్

Director Trivikram Srinivas Praises On Talented Actor Dhanush,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhanush,Dhanush Movies,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Upcoming Movie,Dhanush New Movie Updates,Dhanush Latest Movie Updates,Dhanush Movie Updates,Dhanush Movie News,Dhanush New Projects,Dhanush Latest Projects,Dhanush Upcoming Projects,Dhanush Next Projects,Dhanush Latest News,Dhanush Movie Updates,Dhanush Sir Movie,Sir,Sir Movie,Sir Telugu Movie,Sir Movie Updates,Sir Review,Sir Movie Review,Sir Telugu Movie Review,Trivikram Srinivas Praises On Actor Dhanush,Director Trivikram Srinivas Praises On Dhanush,Trivikram Srinivas Praises On Dhanush,Trivikram Srinivas On Dhanush,Trivikram Srinivas About Dhanush,Trivikram About Dhanush,Trivikram,Trivikram Srinivas,Director Trivikram Srinivas Praises,Trivikram Movies,Trivikram Latest News

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్‌ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈసందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన త్రివిక్రమ్ ధనుష్ పై ప్రశంసలు కురిపించారు. విద్యని కొందరికీ పరిమితం చేస్తూ దానిని డబ్బుతో కొనడం అనే అంశాన్ని తీసుకున్న డైరెక్టర్ వెంకీని ఎంతైనా అభినందించాలి అన్నారు. మొదట వెంకీ ఈ స్టోరీ తనకు వినిపించినపుడే తనకు ఇది పెద్ద సక్సెస్ అవుతుందని అర్ధం అయిందన్నారు. ఇక ధనుష్ గురించి చెబుతూ.. ధనుష్ తనకు చేసే సినిమాల జయాలు, అపజయాల గురించి ఆలోచించరని, తన సినిమాలు తాను ఇష్టంతో కష్టపడి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతారని, అటువంటి వారిని కర్మ యోగులు అంటరాని అన్నారు. ఇక తమిళ్ లో కమల్ హాసన్, శివాజీ గణేశన్, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మాదిరిగా నేటి తరం నటుల్లో ఒక గొప్ప యాక్టర్ గా ధనుష్ నిలిచిపోతారని, తప్పకుండా సార్ మూవీతో తెలుగులో తొలిసారిగా ఆయనకు గొప్ప విజయం లభిస్తుందని అన్నారు.

కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్ర‌కాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =