తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. గత ఏడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ధనుష్ నటించాడు కూడా.ఇక ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో మరో సినిమా కూడా వస్తుంది అదే నీక్.ఇందులో పవిష్ ,వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,అనికా సురేంద్రన్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.ఈసినిమా నుండి వచ్చిన గోల్డెన్ స్పారో అనే సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో విడుదలకానుంది.ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తుంది. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి రానుంది.
ఇక ధనుష్ ప్రస్తుతం హీరోగాను ఫుల్ బిజీ గా వున్నాడు.తెలుగులో ధనుష్ కుబేర లో నటిస్తున్నాడు.ఇందులో రష్మిక హీరోయిన్ కాగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా కాకుండా తమిళంలో ధనుష్ ఇడ్లీ కడాయి అనే సినిమా చేస్తున్నాడు.అలాగే ఇళయరాజా బయోపిక్ కూడా లైన్లో వుంది.ఇక హిందీ లోకూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: