ట్యాగ్ · 58 కథనాలు
అల్లు అర్జున్ సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే

అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్ చేశా

పుష్ప 2- యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్స్ షూటింగ్
మరో సారి గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర

బన్నీకి వార్నర్ స్పెషల్ బర్త్ డే విషెస్
20 ఏళ్లు పూర్తి చేసుకున్న.. మీ ప్రేమ వల్లే

గంగోత్రి మూవీ జోడీ లేటెస్ట్ ఫొటో

17 ఏళ్ల తరువాత మ్యాజికల్ ట్రియో..!

హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!

పుష్పరాజ్ న్యూ లుక్
ఒకే ఒక్కడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు. విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
అల్లు అర్జున్ సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు
తొమ్మిది దశాబ్దాలకు పైబడి చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య వంటి లెజెండరీ నటుడి మనవడిగా, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో.

అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తోనే
పుష్ప 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది.గత ఏడాది చివర్లో విడుదలైన ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్ళతో బహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది, ముఖ్యంగా హిందీ లో ఊహించని రన్ ను కొనసాగించింది. 820 కోట్ల నెట్ తో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఈసినిమా తో అల్లు అర్జున్ హిందీ లో బాగా పాపులర్ అయిపోయాడు.
ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన ఇంద్రజ కథానాయికగా కనిపించనున్నారు. అలాగే యువ నటులు అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో.. అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్ చేశా
ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అంకిత్ కొయ్య నటించాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

పుష్ప 2- యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్స్ షూటింగ్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఆగష్ట్ 15 తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈదిశగా త్వరలోనే షూటింగ్ ను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మరో సారి గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్
మన హీరోలు సినీమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకునే పనులు చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి అది రుజువు చేశారు. కేరళలోని వయనాడు వరదలు విద్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందించారు. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు. తన వంతుగా 25 లక్షల రూపాయలని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు అల్లు అర్జున్. ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు బన్నీ.

2024 సెకండాఫ్ లో స్టార్ హీరోల జాతర
ప్రతి ఏడూ ఎన్నో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సీజన్లలో మాత్రం సినిమాల సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ. ఈపండుగకు పెద్ద పెద్ద సినిమాలు బరిలో దిగుతుంటాయి.. ఆ తరువాత ఫిబ్రవరి, మార్చిలో ఫ్లో కాస్త తగ్గినా సమ్మర్ కు మాత్రం మళ్లీ జోరు పెరుగుతుంది. ఇలా సీజన్ ను బట్టి సినిమాల రిలీజ్ కు ఉంటాయి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి బాగానే రిలీజ్ అయినా.. సమ్మర్ సీజన్ మాత్రం కాస్త నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. వెరసి ఫస్ట్ హాఫ్ లో అంతంత మాత్రంగానే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది సెకండాఫ్ గురించి. ఇక…
బేబి ప్రొడ్యూసర్‌కు అల్లు అర్జున్ పరామర్శ.. కృతజ్ఞతలు తెలిపిన ఎస్‌కేఎన్
జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు 'బేబి' ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ (శ్రీనివాస కుమార్) కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా నిర్మాత ఎస్‌కేఎన్, గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌కి దగ్గరగా ఉండే వ్యక్తిగా మరియు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా సుపరిచితుడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన గతంలో.. అంటే తొలుత ఇండస్ట్రీలో సినీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఎస్‌కేఎన్.. అనంతరం అల్లు అర్జున్ సహా పలువురు హీరోలకు పీఆర్వోగా పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు.
నల్గొండ జిల్లా పర్యటనలో అల్లు అర్జున్.. గజమాలతో స్వాగతం పలికిన ఫ్యాన్స్
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం నల్గొండ జిల్లాలో సందడి చేశారు. ఒక్కరోజు పర్యటనకు విచ్చేసిన ఆయన జిల్లాలోని పెద్దవూర మండలం, బట్టు గూడెం గ్రామంలో తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే మెగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అల్లు అర్జున్‌కు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

బన్నీకి వార్నర్ స్పెషల్ బర్త్ డే విషెస్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ తో తను ఎంత ఫేమస్ అయ్యాడో ఈమధ్య సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలతో అంతే ఫేమస్ అయ్యాడు. గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో వార్నర్ చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. అలవైకుంఠపురములో మూవీలో 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఆతరువాత పలు హీరోల పాటలకు కూడా తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను'…
20 ఏళ్లు పూర్తి చేసుకున్న.. మీ ప్రేమ వల్లే
2003లో ' గంగోత్రి ' చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన నటుడు అల్లు అర్జున్. తండ్రి టాప్ ప్రొడ్యూసర్.. తాత అలనాటి ప్రముఖ కమెడియన్.. ఇంకా మేనమామ అగ్ర హీరో ఒకపక్క వారి ప్రోత్సాహం అందినా కూడా తన కష్టం తో.. పట్టుదలతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తన స్టయిల్ తో.. నటనతో.. డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ కెరీలో లో ఎన్నో విభిన్నమై సినిమాల్లో నటించాడు. పాత్ర ప్రాముఖ్యత చూస్తాడు కాబట్టే వేదం.. రుద్రమదేవి సినిమాల్లో నిడివి తక్కువైనా కూడా అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి…
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు…

అల్లు స్టూడియోస్ పుష్ప:ది రూల్ మూవీ తో ప్రారంభం ?
చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ తరలి వచ్చిన తరువాత హైదరాబాద్ లో పలు స్టూడియోలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ కి చెందిన అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రామానాయుడు స్టూడియో, రామానాయుడు సినీ విలేజ్ (నానక్ రామ్ గూడా) సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి చెందిన పద్మాలయా స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణా హార్టికల్చరల్ స్టూడియో (నాచారం) లు ఉన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో , రామానాయుడు స్టూడియో రన్ అవుతూ సినిమా షూటింగ్ లతో కళ కళలాడుతున్నాయి.

గంగోత్రి మూవీ జోడీ లేటెస్ట్ ఫొటో
యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన గంగోత్రి మూవీ 2003 మార్చి 28 వ తేదీ రిలీజ్ అయ్యింది. దర్శకుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 100 వ మూవీ గా తెరకెక్కిన గంగోత్రి మూవీ తో అల్లు అర్జున్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అదితి అగర్వాల్ కథానాయిక. ప్రకాష్ రాజ్ , సుమన్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించి గంగోత్రి మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

17 ఏళ్ల తరువాత మ్యాజికల్ ట్రియో..!
బన్నీ- సుకుమార్-రత్నవేలు ఈ మ్యాజికల్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరోసారి ఈ కాంబినేషన్ కలిసింది. అయితే ఏదో సినిమా కోసం కాదులెండి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అల్లు అర్జున్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేథ్యంలో ఓ కమర్షియల్ యాడ్ కోసం బన్నీ, సుకుమార్, రత్నవేలు కలిసి పనిచేస్తున్నారు. ఈసందర్భంగా సెట్ లో వీరు ముగ్గురు కలిసి తీసుకున్న ఫొటోను సుకుమార్ సతీమణి బబిత సుకుమార్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాదాపు 17ఏళ్ల తరువాత ఈ మ్యాజికల్ ట్రియో కలిసి పనిచేస్తున్నారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో బన్నీ...!
హరీష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అయింది.. ఎప్పుడు స్టార్ చేశారు అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. హరీష్ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడు. అయితే అది సినిమా కాదు.. ఒక యాడ్ కోసం పనిచేస్తున్నారు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఆ యాడ్ దర్శకత్వ భాద్యతలు హరీష్ శంకర్ తీసుకున్నారు. దీనికి వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ షూట్ జరుగుతుంది. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

పుష్పరాజ్ న్యూ లుక్
“పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

బాలీవుడ్ లో సౌత్ మూవీస్ సక్సెస్ పై అల్లు అర్జున్ స్పందన
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ చిత్ర పరిశ్రమకు దక్షిణాది సినిమాలపై ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. భారీ బడ్జెట్ మూవీస్ తో భారీ కలెక్షన్స్ సాధించేవారమనీ బాలీవుడ్ అనుకొనేది , దక్షిణాది మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. "బాహుబలి ", బాహుబలి 2", "సాహో", కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీస్ భారీ కలక్షన్స్ రాబట్టి బాలీవుడ్ లో సత్తాచాటాయి. తాజాగా "పుష్ప :ది రైజ్", "కె జి ఎఫ్ చాప్టర్ 2 ", "మేజర్ " వంటి మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. సౌత్ మూవీస్ సక్సెస్ రేట్ చూసి బాలీవుడ్ నిర్మాత , దర్శకులు , ప్రేక్షకులు దక్షిణాది మూవీస్ పై ఆసక్తి…