క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన ఇంద్రజ కథానాయికగా కనిపించనున్నారు. అలాగే యువ నటులు అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో.. అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ బుధవారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాను డైరెక్టర్ సుకుమార్, తబిత దంపతులు వీక్షించారు. వినోదంతో పాటు చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో తన సమర్పణలో విడుదల చేయడానికి తబిత ముందుకు వచ్చారు.
‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రావు రమేష్, అంకిత్ కొయ్య తండ్రి కుమారుల పాత్రలు చేశారు. రావు రమేష్ తన తండ్రి కాదని, తాను అల్లు కుటుంబంలో పుట్టానని, అల్లు అరవింద్ తన తండ్రి – అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకునే క్యారెక్టర్ చేశారు అంకిత్ కొయ్య. ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ పాడుకునే పాటల్లోనూ అల్లు అర్జున్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రీ క్రియేషన్ చేశారు.
ఇక ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందిస్తుండగా.. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సురేష్ భీమంగని ఆర్ట్ డైరెక్షన్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే రుషి మర్ల, శివప్రసాద్ మర్ల సహ నిర్మాతలుగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























