తొమ్మిది దశాబ్దాలకు పైబడి చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య వంటి లెజెండరీ నటుడి మనవడిగా, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్ నేటితో 22 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకుంటున్నారు. 2003లో నూనూగు మీసాల వయస్సులో ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేడు పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమిస్తూ ఈ స్థాయికి ఎదిగిన తీరు పలువురికి ఆదర్శం. ఈ నేపథ్యంలో ఆయన 22 ఏళ్ళ సినీ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ.
అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. చెన్నైలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో చదివి, హైదరాబాద్‌లోని MSR కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం మూలాన ఆయన చిన్నతనంనుంచే డ్యాన్స్ లో మంచి ప్రతిభ కనబరిచేవారు. ఈ క్రమంలో నటనపై ఆసక్తితో తొలిసారిగా విజేత (1985)లో బాలనటుడిగా నటించారు.
అలాగే డాడీ (2001)లో ఉత్సాహవంతుడైన యంగ్ డాన్సర్ గా నటించారు. కాగా ఈ రెండు చిత్రాలూ తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసినవే కావడం గమనార్హం. దీని తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి 100రోజులు ఆడటమే కాకుండా అర్జున్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత డెబ్యూ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కల్ట్ క్లాసిక్ ‘ఆర్య’ (2004)తో ఒక్కసారిగా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.
దీని తర్వాత వరుసగా.. బన్నీ (2005), దేశముదురు (2007), ‘పరుగు’ 92008) వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ ఆర్య 2 (2009), వేదం (2010), జులాయి (2012), రేసు గుర్రం (2014), S/O సత్యమూర్తి (2015), సరైనోడు (2016), DJ: దువ్వాడ జగన్నాధం (2017) మరియు అల వైకుంఠ పురం (2020) వంటి పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్థాయిని పెంచిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. 2021లో వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. హిందీలో ఏకంగా రూ.100కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక దీనికి సీక్వెల్ గా గతేడాది చివరిలో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ అయితే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ఓవరాల్ గా ఇండియాలో రెండవ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ మూవీతో గ్లోబల్ రేంజ్ లో అల్లు అర్జున్ ఖ్యాతి తెచ్చుకున్నారు.
అభిమానులతో ముద్దుగా ‘స్టైలిష్ స్టార్’, ‘ఐకాన్ స్టార్’ అనే పేర్లతో పిలిపించుకునే అల్లు అర్జున్ ఇప్పటివరకూ జాతీయ అవార్డు సహా ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు మూడు నంది అవార్డులు అందుకున్నారు. ఆర్య సినిమాకి ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకోవడం విశేషం. పరుగు సినిమాకు ఉత్తమ నటుడిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే ‘రుద్రమదేవి’ (2015) సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అయన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
ఇక అల్లు అర్జున్ అనేక బ్రాండ్లు మరియు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ప్రో కబడ్డీ లీగ్ మరియు స్ట్రీమింగ్ సర్వీస్ ఆహాకు ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్. దుబాయ్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తద్వారా దక్షిణాది నుండి ఈ ఘనత అందుకున్న నాలుగో స్టార్ గా గుర్తింపు పొందారు. అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్, మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మలను ఈ మ్యూజియంలో ఆవిష్కరించారు.
మరో 10రోజుల్లో జన్మదినం జరుపుకోబోతున్న అల్లు అర్జున్.. ముందుముందు మరిన్ని మంచి చిత్రాలలో నటించాలని, అద్భుతమైన పాత్రలను పోషించాలని, జీవితంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమ పేరుప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తం చేయాలనీ కోరుకుంటూ.. తెలుగు ఫిల్మ్ నగర్ తరపున ఐకాన్ స్టార్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























