బేబి ప్రొడ్యూసర్‌కు అల్లు అర్జున్ పరామర్శ.. కృతజ్ఞతలు తెలిపిన ఎస్‌కేఎన్‌

Icon star Allu Arjun Visits Producer SKN's Home and Condolences to His Father Demise

జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ‘బేబి’ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌ (శ్రీనివాస కుమార్) కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా నిర్మాత ఎస్‌కేఎన్‌, గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌కి దగ్గరగా ఉండే వ్యక్తిగా మరియు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా సుపరిచితుడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన గతంలో.. అంటే తొలుత ఇండస్ట్రీలో సినీ జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఎస్‌కేఎన్.. అనంతరం అల్లు అర్జున్‌ సహా పలువురు హీరోలకు పీఆర్వోగా పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేసి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇటీవలే (జనవరి 4) నిర్మాత ఎస్‌కేఎన్‌ తండ్రి ఎస్‌కేఎన్ తండ్రి గాదె సూర్య ప్రకాశరావు అనారోగ్యోంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు శిరీష్ సహా పలువురు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఎస్‌కేఎన్ తండ్రి మృతికి సంతాపం తెలిపారు. ఇక బన్నీకి పీఆర్వోగా పనిచేసిన పరిచయంతో ఆయనకు సన్నిహితుడిగా మారారు. ఈ క్రమంలోనే నేడు అల్లు అర్జున్ ఎస్‌కేఎన్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దీంతో ఎస్‌కేఎన్ సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఒక పోస్ట్ షేర్ చేశారు.

“ఈ కష్ట సమయంలో మా ఇంటికి వచ్చినందుకు ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తండ్రి మృతికి సంతాపం తెలిపినందుకు మరియు మీ దయ, మద్దతుకు నా ధన్యవాదాలు” అని ఎస్‌కేఎన్ పేర్కొన్నారు. కాగా గతేడాది ‘బేబీ’ సినిమాతో ఎస్‌కేఎన్ మంచి సక్సెస్ అందుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 5 =