పుష్ప 2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది.గత ఏడాది చివర్లో విడుదలైన ఈసినిమా 1800 కోట్లకుపైగా వసూళ్ళతో బహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసి సెన్సేషన్ సృష్టించింది, ముఖ్యంగా హిందీ లో ఊహించని రన్ ను కొనసాగించింది. 820 కోట్ల నెట్ తో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఈసినిమా తో అల్లు అర్జున్ హిందీ లో బాగా పాపులర్ అయిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో తన నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు హిందీ జనాలు.ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి వుంది. కుదిరితే ఈసినిమాను ఉగాదికి లాంచ్ చేయాలని చూశారు. కానీ ఇది ఇప్పుడప్పుడే అయ్యలా లేదు.స్క్రిప్ట్ వర్క్ కు ఇంకా చాలా సమయం పట్టనుందట. దాంతో పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేయలని చూస్తున్నాడు.ఇప్పటికే అల్లు అర్జున్, అట్లీ చెప్పిన స్టోరీ కి ఓకే చెప్పాడు. నిర్మాత ఎవరనేది ఫైనల్ కావాల్సివుంది.దాదాపు రెమ్యునరేషన్లే 400కోట్ల కానున్నాయట.దాంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు.మరి ఈ ప్రాజెక్ట్ ను ఏ నిర్మాత టేక్ ఆఫ్ చేస్తారనేది త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక త్రివిక్రమ్ తో సినిమా చేసిన తరువాత అల్లు అర్జున్ పుష్ప 3 కూడా చేయనున్నాడు.ఈవిషయాన్ని పుష్ప నిర్మాత మైత్రి రవి కంఫర్మ్ చేశాడు.అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తో చేయనున్నాడని ఆ ఆతరువాత త్రివిక్రమ్ తో సినిమా చేసి తర్వాత పుష్ప 3 చేస్తాడని ఆయన అన్నారు.అలాగే 2028లో పుష్ప 3 ని థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పారు.సో అల్లు అర్జున్ ఈ మూడేళ్లు ఫుల్ బిజీ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: