“పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“పుష్ప :ది రైజ్”మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ , తన కుటుంబ సభ్యుల ఫొటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో 18.5 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బ్లాక్ టీ షర్ట్ ధరించి.. బ్లాక్ బ్యాక్ గ్రౌండ్లో హ్యాండ్సమ్గా రివీలైన అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బన్నీ బ్లాక్ డ్రెస్ లుక్కు అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా తెగ పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. స్టైల్ లో నిన్ను కొట్టే వాడేలేడంటూ.. అభిమానులు అల్లు అర్జున్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























