20 ఏళ్లు పూర్తి చేసుకున్న.. మీ ప్రేమ వల్లే

icon star allu arjun completes his 20 years journey in film industry

2003లో ‘ గంగోత్రి ‘ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన నటుడు అల్లు అర్జున్. తండ్రి టాప్ ప్రొడ్యూసర్.. తాత అలనాటి ప్రముఖ కమెడియన్.. ఇంకా మేనమామ అగ్ర హీరో ఒకపక్క వారి ప్రోత్సాహం అందినా కూడా తన కష్టం తో.. పట్టుదలతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తన స్టయిల్ తో.. నటనతో.. డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ కెరీలో లో ఎన్నో విభిన్నమై సినిమాల్లో నటించాడు. పాత్ర ప్రాముఖ్యత చూస్తాడు కాబట్టే వేదం.. రుద్రమదేవి సినిమాల్లో నిడివి తక్కువైనా కూడా అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రీసెంట్ గా సంచలన విజయాన్ని సాధించిన అల వైకుంఠపురములో చిత్రాల్లో క్లాస్ గా మాత్రమే నటించడమే కాదు.. దేశముదురు, బన్నీ, బద్రీనాథ్, సరైనోడు,దువ్వాడ జగన్నాథం వంటి మాస్ పాత్రల్లో కూడా ఒదిగిపోయి నటించగలిగే సత్తా ఉన్న నటుడు. ఇక ఇటీవల పుష్ప సినిమాతో ఊర మాస్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటించిన తన సత్తాను దేశవ్యాప్తంగా చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేటితో అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా ఇదే రోజున అల్లుఅర్జున్‌ నటించిన ‘గంగోత్రి’ సినిమా విడుదలైంది. రాఘవేంద్ర‌రావు బ‌న్నీని ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేశాడు. 2003లో విడుద‌లై ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ఈ చిత్రానికి 3 కోట్ల బ‌డ్జెట్ పెడితే 11కోట్ల షేర్ వ‌చ్చింది. ఇక ఈసందర్భంగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ రోజుతో నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నన్ను ఆశీర్వదించారు. ప్రేమతో ఆదరించారు… సినీ పరిశ్రమకు చెందిన నా వారందరికీ నేను కృతజ్ఞుడిని. ప్రేక్షకులు, ఆరాధకులు, అభిమానుల ప్రేమ వల్లే నేనిలా ఉన్నా. ఎప్పటికీ కృతజ్ఞతలు అంటూ తెలిపారు.

ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =