మన హీరోలు సినీమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకునే పనులు చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి అది రుజువు చేశారు. కేరళలోని వయనాడు వరదలు విద్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందించారు. ఇప్పుడు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వరద బాధితులకు ఆర్థిక సాయం అందించారు. తన వంతుగా 25 లక్షల రూపాయలని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు అల్లు అర్జున్. ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు బన్నీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత, కేరళ లో ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్, అక్కడ అందరికీ మల్లు అర్జున్ గా సుపరిచితం. సినిమాలతో పాటు, ఆయన పలు సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు.
2013 లో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు పది లక్షల రూపాయలు, 2014 లో ఆంధ్రప్రదేశ్ లో హుద్ హుద్ తుఫానొచ్చినప్పుడు 25 లక్షల రూపాయలు, 2015 లో చెన్నై లో తుఫానొచ్చినప్పుడు 25 లక్షల రూపాయలు, 2018 లో తిట్లి తుఫాను సహాయక చర్యలకు 25 లక్షల రూపాయల విరాళం తో పాటు, మూడు ఆర్ ఓ వ్వాటర్ ప్లాంట్లని, ఒక బోర్ వెల్ ని స్థాపించారు. అదే సంవత్సరం లో కేరళ లో వరద సహాయక చర్యలకు 25 లక్షల రూపాయలు విరాళం అందించారు. అంతే కాకుండా, కరోనా సమయం లో అత్యధికంగా కోటి నలభై ఐదు లక్షల రూపాయలను, 2021 లో ఆంధ్రప్రదేశ్ లో వరద సహాయక చర్యలకు గాను 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఇలా ఎప్పటికప్పుడు సాయం అందించడం లో అల్లు అర్జున్ ముందుంటూనే అభిమానులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: