సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఆగష్ట్ 15 తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈదిశగా త్వరలోనే షూటింగ్ ను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి ఈమధ్య పలు వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్‌కు, సుకుమార్‌కి మధ్య గొడవలు అయినట్లు.. అందుకే అల్లు అర్జున్ తన గడ్డం తీసేసి ట్రిప్‌కు వెళ్లాడన్నా వార్తలు వచ్చాయి. మరోవైపు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ వల్ల కూడా లేట్ అవుతుందన్న వార్తలు తెరపైకి వచ్చాయి. తను మలయాళంలో సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమాకు డేట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతోనే సినిమా షూటింగ్ లేట్ అవుతుందన్న కథనాలు వచ్చాయి.
ఇక ఇలాంటి తరుణంలోనే ఈసినిమా షూటింగ్ గురించి సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తమ ట్విట్టర్ ద్వారా ప్రస్తుతం చిత్రయూనిట్ స్పెక్టాక్యులర్ క్లైమాక్స్ షూటింగ్ లో ఉందని తెలియచేశారు.ఈ సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో ఫ్యాన్స్ కాస్త ఊరట చెందారు.
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుంది. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: