ట్యాగ్ · 102 కథనాలు · పేజీ 3
మాల్దీవులలో అల్లుఅర్జున్ ఫ్యామిలీ తో ఎంజాయ్
'ఎఫ్ 3' సెట్ లో 'ఐకాన్ స్టార్'
అల్లు అర్జున్ కు అభిమాని స్పెషల్ గిఫ్ట్
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్
కథా చర్చలలో "ఐకాన్ "

'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లు అర్హ
ఓ మై కడవులే రీమేక్ లో అతిథి పాత్రలో..!
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
'గని' సెట్ లో బన్నీ
మళ్లీ మొదలుపెట్టిన 'పుష్ప' రాజ్
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో
పిల్లలతో సరదాగా 'బన్నీ'
వర్చ్యువల్ గా కథలు వింటూ అల్లు అర్జున్ బిజీ
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "సక్సెస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అఖిల్ అక్కినేని ఎన్ ఆర్ ఐ , పూజాహెగ్డే స్టాండ్ అప్ కమెడియన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మాల్దీవులలో అల్లుఅర్జున్ ఫ్యామిలీ తో ఎంజాయ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కొంత సమయం కేటాయిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితమైన అల్లు అర్జున్ పిల్లలతో తెగ ఎంజాయ్ చేశారు. ఇక కొన్ని రోజులుగా "పుష్ప " మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రీసెంట్‌గా తన ఫ్యామిలీతో మాల్దీవులకి వెళ్ళారు. అక్కడ స్విమ్మింగ్ ఫూల్‌లో సరదాగా ఈత కొడుతున్న అల్లు అర్జున్ , అర్హ, ఆయాన్‌ల వీడియోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో"ఫ్యామిలీవెకేషన్"అంటూ షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.
'ఎఫ్ 3' సెట్ లో 'ఐకాన్ స్టార్'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఈసినిమా ఎఫ్2 సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అయితే కొంతవరకూ షూటింగ్ ను జరిపిన తరువాత కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఎఫ్ 3 సెట్ కి వచ్చి అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. సెట్ లో అల్లు అర్జున్.. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు అనిల్ రావిపూడి, నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో…
అల్లు అర్జున్ కు అభిమాని స్పెషల్ గిఫ్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తెలుగు చిత్ర పరిశ్రమలో కాకుండానే మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా అశేష అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అక్కడి అభిమానులు అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా ముద్దుగా పిలుచుకుంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు.
బోయపాటికి కూడా డేట్స్ ఇచ్చేసిన 'బన్నీ'
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో పుష్ప సినిమా వస్తున్న తెలిసిందే కదా. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది..వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
"సౌత్ కా సుల్తాన్" అల్లు అర్జున్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమానులు అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. "పుష్ప "మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కథా చర్చలలో "ఐకాన్ "
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయంతెలిసిందే . రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ "పుష్ప - ది రైజ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "పుష్ప - ది రైజ్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లు అర్హ
అల్లు వారసత్వంతో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా టాప్ లో ఉన్నారు , ఆ తర్వాత తనయులు బన్నీ, శిరీష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు అదే వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ. అల్లు అర్హ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా శాకుంతలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే షూటింగ్ లో కూడా పాల్గొంది అల్లు అర్హ. ఇక ఇదిలా ఉండగా నేడు అల్లు అర్హ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్హ కు ఎలాగైతే గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారో.. అంతే గ్రాండ్ గా చిత్రయూనిట్ అర్హకు వీడ్కోలు…
ఓ మై కడవులే రీమేక్ లో అతిథి పాత్రలో..!
ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కాకుండా విశ్వక్ సేన్ ఓ మై కడవులే సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, అశ్వథ్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు.
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు
మన సినిమాలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఇక మన మేకర్స్ మలయాళంలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు రీమేక్ చేసుకుంటున్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్, లవ్ మాక్ టైల్ ఇంకా చాలా సినిమాలే రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా హక్కులు కూడా టాలీవుడ్ స్టార్ హీరో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్.

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు , మలయాళ ప్రేక్షకులనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. 2020 సంవత్సరం బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ మూవీ లో నటిస్తున్నారు.
'గని' సెట్ లో బన్నీ
వరుణ్ తేజ్ ప్రస్తుతం కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ చేశారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు. ఇక ఇదిలాఉండగా తాజాగా గని సెట్ లో బన్నీ సందడి చేశారు.
మళ్లీ మొదలుపెట్టిన 'పుష్ప' రాజ్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. లాక్ డౌన్ కు ముందే ఈసినిమా చాలావరకూ షూటింగ్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. కరోనా సెకండ్ వేవ్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరిపినా కూడా ఆఖరికి బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మళ్లీ ఇన్ని రోజులకు సెట్స్ పైకి వచ్చారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి…

గోవా లో "పుష్పరాజ్" ఇంట్రడక్షన్ సాంగ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
ఈమధ్య సినిమాల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకూ కథలోనే కాదు తమ లుక్ విషయంలో కూడా సినిమా సినిమాకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫార్ములాను అల్లు అర్జున్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలోనే తన డీగ్లామర్ లుక్ లోకి మారిపోయి కొత్తగా ట్రై చేస్తున్నాడు. పుష్ప లుక్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఐకాన్ కోసం కూడా సాలిడ్ లుక్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.“పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోలు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక బన్నీ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటి వరకూ స్టైలిష్ పాత్రల్లో నటించిన బన్నీ ఈ సినిమాలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.
పిల్లలతో సరదాగా 'బన్నీ'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇక ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్ లు కూడా లేవు.. దీంతో ఫ్యామిలీతో గడిపే టైమ్ మరింత దొరికింది. ఈనేపథ్యంలో తన కూతురు, కొడుకు అయాన్, అర్హతో మంచిగా టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక ఈ స్వీట్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సతీమణి స్నేహా రెడ్డి. ఇప్పటికే అలాంటి స్వీట్ వీడియోస్ ఎన్నో తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్నేహా ఇప్పుడు మరో వీడియోను షేర్ చేసింది.
వర్చ్యువల్ గా కథలు వింటూ అల్లు అర్జున్ బిజీ
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్, జగపతి బాబు , ధనంజయ్, సునీల్ , అనసూయ ముఖ్య పాత్రలలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.