ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇక ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్ లు కూడా లేవు.. దీంతో ఫ్యామిలీతో గడిపే టైమ్ మరింత దొరికింది. ఈనేపథ్యంలో తన కూతురు, కొడుకు అయాన్, అర్హతో మంచిగా టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక ఈ స్వీట్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సతీమణి స్నేహా రెడ్డి. ఇప్పటికే అలాంటి స్వీట్ వీడియోస్ ఎన్నో తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్నేహా ఇప్పుడు మరో వీడియోను షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవీడియోలో కూడా ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకు ఏదో వివరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది.
View this post on Instagram
కాగా ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లుఅర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేసే ప్లాన్ ఉన్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ను ఈ ఏడాదిలో రెండో పార్ట్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేద్దామనుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: