
ట్యాగ్ · 26 కథనాలు


'జవాన్' షూటింగ్ లో పాల్గొన్న నయనతార..!

థాయ్ ల్యాండ్ లో విఘ్నేష్ శివన్ , నయనతారల హనీమూన్

'ధోని'తో నయన తార సినిమాపై క్లారిటీ..!

నయనతార బర్త్ డే కి సమంత స్పెషల్ విషెస్

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'

లేడీ సూపర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే
నయన్-విఘ్నేష్ రొమాంటిక్ పిక్
'నెట్రికన్' ఫస్ట్ లుక్ రిలీజ్
ఛాలెంజింగ్ రోల్ లో నయనతార
పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ లో నయనతార ?

నయనతార రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ
మనసునక్కరే ( 2003) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నయనతార అయ్య(2005)మూవీతో కోలీవుడ్, లక్ష్మీ(2006)మూవీతో టాలీవుడ్, సూపర్(2010) మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ప్రస్తుతం ఇరైవన్ తమిళ మూవీ లో నటిస్తున్నారు. జవాన్ మూవీతో నయనతార బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

'జవాన్' షూటింగ్ లో పాల్గొన్న నయనతార..!
తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ బాద్ షా కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రకటించినా కూడా షూటింగ్ మాత్రం చాలా ఆలస్యంగానే మొదలైంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు. జవాన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు నయన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. కొద్ది రోజులుగా నయన తార తన పెళ్లి వలన బిజీ అయిపోయింది. ఇక పెళ్లి తరువాత కూడా కొద్ది…

థాయ్ ల్యాండ్ లో విఘ్నేష్ శివన్ , నయనతారల హనీమూన్
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార, నిర్మాత , దర్శకుడు విఘ్నేష్ శివన్ ల వివాహం జూన్ 9 వ తేదీ జరిగిన విషయం తెలిసిందే. మహాబలిపురంలో వీరి మ్యారేజ్ ఆద్యంతం అబ్బురపరిచేలా జరగడం విశేషం. రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు దిగ్గజ సెలబ్రిటీలు నయనతార-విఘ్నేష్ పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.అనంతరం మిత్రులు, శ్రేయోభిలాషులు,సినీ సెలబ్రిటీలు, మీడియాకి దంపతులిద్దరూ ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు…

'ధోని'తో నయన తార సినిమాపై క్లారిటీ..!
టీమిండియా కూల్ కెప్టెన్ అంటే ఎవరి పేరు చెబుతారు.. ఇంకెవరూ ధోనీనే. కూల్ కెప్టెన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ధోనికి స్పెషల్ పేజ్ ఉంటుంది. ఎన్నో మ్యాచ్ లలో.. టీమిండియా ఓడిపోతుందనుకునే మ్యాచ్ లలో కూడా తన కూల్ ఫినిషింగ్ తో గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ధోని కెప్టెన్ గా మాత్రమే కాకుండా దాదాపు చాలా బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక ఒకపక్క క్రికెట్ ఆడుతూనే మరోపక్క బిజినెస్ రంగంలోకి కూడా వెళుతున్నాడు. ఇప్పటికే చాలా వాణిజ్య ప్రకటనలకు అంబాసిడర్ గా ఉన్నాడు. మరోపక్క ఫామింగ్ కూడా మొదలుపెట్టాడు.

నయనతార బర్త్ డే కి సమంత స్పెషల్ విషెస్
విఘ్నేష్ శివన్ దర్శకత్వం లో విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "కాతు వాకుల రెండు కాదల్ " తమిళ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయన తార బర్త్ డే (నవంబర్ 18) కి అభిమానులు ,సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. "కాతు వాకుల రెండు కాదల్ " మూవీ సెట్ లో నయనతార బర్త్ డే ఏర్పాట్లను దర్శకుడు విఘ్నేష్ శివన్ స్వయంగా చేశారు. నయనతార చేత భారీ కేక్‌ని కట్ చేయించి కాబోయే భార్యకి విషెస్ తెలిపారు.

నయన్ మరో హారర్ సినిమా 'కనెక్ట్'
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే హీరోయిన్లలో నయనతార పేరు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అనేక హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన నయన్.. ఇప్పుడు ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఎక్కువగా చేస్తుంది. ఇక నయనతార ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్రికన్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలానే రజినీకాంత్ సినిమా అన్నాత్తే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నయన్. రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల కాదల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ…

ఫైనల్లీ ఎంగేజ్ మెంట్ కన్ఫామ్ చేసిన 'నయన్'
మొత్తానికి ఇన్ని రోజులకు స్టార్ హీరోయిన్ కమ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. నయన తార, విఘ్నేష్ శివన్ ల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే కదా. బహిరంగంగా ఎప్పుడూ స్టేట్ మెంట్స్ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో ఇద్దరూ షేర్ చేసే ఫొటోలు.. పోస్ట్ లను బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఈమధ్య పెళ్లిపై కూడా పలు వార్తలు వచ్చాయి. కొంతమంది పెళ్లి అయిపోయిందంటే మరికొంతమంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కథనాలు రాసేశారు. ఇక ఫైనల్ గా ఇన్ని రోజులకు నయన తార ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

లేడీ సూపర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్
తక్కువ సినిమాలు చేసినా కానీ కొంతమంది వాళ్ల ఇంపాక్ట్ మాత్రం చూపిస్తారు. వాళ్లు చేసిన పాత్రలు అంత త్వరగా మరిచిపోలేం. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా తెలుగులో చేసింది చాలా తక్కువ కానీ తన నటన ఇంపాక్ట్ మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. అందుకు ఈగ సినిమాలో సుదీప్ చేసిన నెగెటివ్ రోలే రుజువు. ఆ సినిమాలో పెర్ఫామెన్స్ పరంగా సుదీపే స్టో స్టీలర్. సుదీప్ చేయకుంటే ఈగ సినిమాకు అంత స్థాయి వచ్చేది కాదేమో. మరి ఈ సూపర్ స్టార్ కు మరో సూపర్ స్టార్ అది కూడా లేడీ సూపర్ స్టార్ జోడైతే ఆసినిమా ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్
మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. 'అన్నయ్య'గా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉన్నప్పటికీ అన్నాత్తే చిత్ర బృందం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారు.

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్
కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది. ఈనేపథ్యంలో అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడిందన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందన్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని.. అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఆవార్తలను నిజం చేస్తూ ఈసినిమాలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ కూడా హైద్రబాద్ లో వాలిపోయింది. నేడు అన్నాత్తే…

సూపర్ హిట్ మూవీ రీమేక్ లో నయనతార ?
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన "మాతృదేవోభవ"మూవీ 1991 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది. ఈ మూవీ బెస్ట్ మూవీ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. కీరవాణి స్వరకల్పనలో వేటూరి రచన , కీరవాణి గానం చేసిన "రాలిపోయే పువ్వా " సాంగ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది . బెస్ట్ లిరిసిస్ట్ గా వేటూరి నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కథానాయికలు కాగా సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
వివాహం తర్వాత కూడా సమంత సినిమాలు, వెబ్ సిరీస్, షోలు, మరోపక్క బిజినెస్ అంటూ బిజీ బిజీ గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఒక హీరోయిన్ ఇంత బిజీ గా ఉందంటే ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వొచ్చు. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
సిస్టర్ నయనతార నీకు హ్యాపీ బర్త్ డే
లేడీ సూపర్ స్టార్ నయన తార పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నయన్ కు అభిమానులతో పాటు పలువురు సినీ సీలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇక ఈనేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తనట్విట్టర్ ద్వారా నయన్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. వన్ అండ్ ఓన్లీ నయనతారకు హ్యాపీ బర్త్ డే.. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్’ అంటూ ట్వీట్ చేసింది.
నయన్-విఘ్నేష్ రొమాంటిక్ పిక్
నయనతార విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు. ఆ రూమర్స్ ఆగవు.. వీళ్లిద్దరు ఫొటోస్ షేర్ చేయడం ఆపరు. ఇటీవలే విఘ్నేష్ శివన్ పుట్టిన రోజుకు చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకొని గోవా వెళ్లి సెలబ్రేట్ చేసుకొని వచ్చారు.
'నెట్రికన్' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడు.
ఛాలెంజింగ్ రోల్ లో నయనతార
తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని నయనతార లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మూవీస్ తో పాటు భక్తిరస చిత్రాలతో నయనతార ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్ ఉన్న ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ లో నయనతార ?
తెలుగు , తమిళ , మలయాళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్స్ ఫిల్మ్స్ లో నటిస్తూ నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి నయనతార కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు.