సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే “తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కథానాయికలు కాగా సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అన్నాత్తే “మూవీ దసరా పండగ కు రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. COVID-19 కారణంగా షూటింగ్ నిలిచిపోవడం తో నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. క్రిందటి వారం నుండి హీరో రజనీకాంత్ చెన్నై లో”అన్నాత్తే “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. COVID-19 ప్రికాషన్స్ తో జరుగుతున్న “అన్నాత్తే ” మూవీ షూటింగ్ లో నయనతార జాయిన్ అయ్యారు. 13 నెలల గ్యాప్ తరువాత నయనతార “అన్నాత్తే ” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: