తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్న నయనతార, నిర్మాత , దర్శకుడు విఘ్నేష్ శివన్ ల వివాహం జూన్ 9 వ తేదీ జరిగిన విషయం తెలిసిందే. మహాబలిపురంలో వీరి మ్యారేజ్ ఆద్యంతం అబ్బురపరిచేలా జరగడం విశేషం. రజనీకాంత్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు దిగ్గజ సెలబ్రిటీలు నయనతార-విఘ్నేష్ పెళ్లికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.అనంతరం మిత్రులు, శ్రేయోభిలాషులు,సినీ సెలబ్రిటీలు, మీడియాకి దంపతులిద్దరూ ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపారు. వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతేకాదు తమ పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా సుమారు లక్ష మందికి విందు భోజనాలు పెట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివాహం జరిగిన 10 రోజులకు విఘ్నేష్ శివన్ , నయనతార తమ హనీమూన్ ను థాయ్ ల్యాండ్ లో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. థాయ్ ల్యాండ్ లో అందాలను ఆస్వాధిస్తున్నారు.ఎల్లో డ్రెస్ ధరించి నయన్ చైర్‌లో కూర్చొగా, భర్త విఘ్నేష్ ఆమెకి ప్రేమ పాఠాలు చెబుతున్నారు. ఇద్దరూ తమ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్‌లకు సంబంధించిన హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: