పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ లో నయనతార ?

Nayanthara Comes Back With A Power Packed Entertainer

తెలుగు , తమిళ , మలయాళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ నయనతార స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ కు నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్స్ ఫిల్మ్స్ లో నటిస్తూ నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి నయనతార కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సీనియర్ స్టంట్ కొరియోగ్రాఫర్ రాంబో రాజ్ కుమార్ తనయుడు నవకాంత్ కోలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అసోసియేట్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసిన , కొన్ని షార్ట్ ఫిల్మ్స్ రూపొందించిన నవకాంత్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. హీరోయిన్ నయనతార ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ “అన్నాత్తే “మూవీ తో పాటు మరో మూడు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =