
ట్యాగ్ · 33 కథనాలు


శర్వానంద్ పెళ్లి డేట్, వేదిక ఖరారు

బ్రేక్ ఈవెన్ సాధించిన ఒకే ఒక జీవితం

ఇకపై అలాంటి రోల్స్ రిజెక్ట్ చేస్తా

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?

'ఏక్ మినీ కథ' పై శర్వానంద్ ప్రశంసలు

"మహాసముద్రం "మూవీ అప్ డేట్
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీకారం'
శ్రీకారం టీజర్ కు టైం ఫిక్స్
'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి
కొత్త లుక్ లో అదరగొడుతున్న శర్వా
మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
శర్వా 'శ్రీకారం' - 20 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి

ఘనంగా జరిగిన శర్వానంద్ పెళ్లి వేడుక
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఈ రెండేళ్లలో ఎంతోమంది టాలీవుడ్ హీరోలు పెళ్లిచేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అసలు పెళ్లి చేసుకోను అని చెప్పిన రానానే పెళ్లి చేసుకోవడంతోనే చాలా మంది షాకయ్యారు. ఇక ఇప్పుడు ఆ బ్యాచ్ లర్ల్ లో లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్న హీరో శర్వానంద్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఐదు నెలల తర్వాత ఇప్పుడు వీరి వివాహం జరిగింది. రాజస్థాన్, జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

శర్వానంద్ పెళ్లి డేట్, వేదిక ఖరారు
టాలీవుడ్ చాలా వరకూ యంగ్ హీరోలు అందరూ వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గత రెండు మూడేళ్ల కాలంలోనే చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా ఇంకొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ఉన్నారు. అందులో శర్వానంద్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా శర్వానంద్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నారు.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డి తో హీరో శర్వానంద్ నిశ్చితార్థం
హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షితా రెడ్డితో ఏడడుగులు వేయనున్నారు. ఈ జంట నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్రసీమలోని పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలందజేశారు. రక్షిత తండ్రి పసునూర్ మధుసూదన్ రెడ్డి హై కోర్టు లాయర్‌గా ఉన్నారు.

బ్రేక్ ఈవెన్ సాధించిన ఒకే ఒక జీవితం
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ కార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ , రీతూ వర్మ జంటగా , సీనియర్ హీరోయిన్ అమల ఒక కీలక పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన తన బాడీ లాంగ్వేజ్ , కొన్ని ఎమోషనల్ సీన్స్ లో శర్వానంద్ చాలా బాగా నటించి ప్రేక్షకులను అలరించారు.తల్లి పాత్రలో నటించిన అమల తన నటనతోనూ మరియు తన స్మైల్ తోనూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా నటించిన రీతూ వర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ…

ఇకపై అలాంటి రోల్స్ రిజెక్ట్ చేస్తా
హీరోగా చేయాలంటే మాములు విషయం కాదన్న సంగతి తెలిసిందే కదా. పాత్రలకు తగ్గట్టు తమ బాడీని మర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి స్లిమ్ లుక్ లో, సిక్స్ ప్యాక్ లో కనిపించాల్సి వస్తే మరోసారి కాస్త లావుగా కనిపించాల్సి ఉంటుంది. ఇలా పాత్రకు తగ్గట్టు మేకోవర్ ను మార్చుకుంటారు. అయితే ఇకపై ఫ్యాట్ గా కనిపించే పాత్రలు చేయనంటున్నాడు శర్వానంద్. ఇటీవలే శ్రీకార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు శర్వానంద్. చాలా కాలం తరువాత సక్సెస్ అందడంతో ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ ?
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ "మహాసముద్రం" మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన "ఒకే ఒక జీవితం"మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'మహా సముద్రం' మోషన్ పోస్టర్ రిలీజ్
శర్వానంద్, సిద్ధార్ధ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మహాసముద్రం'. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదల చేసిన శర్వానంద్, సిద్దార్ధ్, అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు అన్నింటిని…

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?
సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మహాసముద్రం "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాషలలో "ఒకే ఒక జీవితం ", శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీస్ తెరకెక్కుతున్నాయి. హీరో శర్వానంద్ ప్రస్తుతం "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు ఒక టైమ్ ట్రావెల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

'ఏక్ మినీ కథ' పై శర్వానంద్ ప్రశంసలు
కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా.. కావ్య థాపర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏక్ మినీ కథ. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈసినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించింది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమా టీజర్, ట్రైలర్ లతోనే ఈసినిమా అంచనాలు పెంచేసింది. ఇక బ్రహ్మాజీ, హర్షవర్ధన్, సుదర్శన్, పోసాని, శ్రద్ధాదాస్, సప్తగిరి తదితరులు నటించిన ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో నేడు రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

"మహాసముద్రం "మూవీ అప్ డేట్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హిట్ "RX100"మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ , సిద్ధార్ధ్ లు హీరోలుగా సముద్రం నేపథ్యం లో రూపొందుతున్న లవ్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “మహాసముద్రం “ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
శర్వా బర్త్ డే ట్రీట్... మహాసముద్రం ఫస్ట్ లుక్ - కొత్త సినిమా టైటిల్ రిలీజ్
యంగ్ హీరో శర్వానంద్ నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చాడు. తన సినిమాల అప్ డేట్ లు ఇచ్చారు శర్వా దర్శక నిర్మాతలు. ప్రస్తుతం శర్వా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు శర్వా పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న 'శ్రీకారం'
జయాపజయాలతో సంబంధం లేకుండా విబిన్నంగా సినిమాలు చేసే యువ హీరోల్లో శర్వానంద్ ఒకడు. కెరీర్ మొదటి నుంచి కూడా కాస్త డిఫరెంట్ గా ఉండే స్టోరీలనే చేయడాానికి ఇష్టపడుతుంటాడు శర్వా. ఇక ఇప్పుడు శ్రీకారంతో ముందుకు వస్తున్నాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా... ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 11న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు అలాగే పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
శ్రీకారం టీజర్ కు టైం ఫిక్స్
కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పలు సాంగ్స్, పోస్టర్స్ లాంటివి ఇప్పటికే రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక టీజర్ అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
'మహా సముద్రం' రిలీజ్ డేట్ ఫిక్స్
అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 'మహా సముద్రం' సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా.. ఇందులో శర్వానంద్ - సిద్దార్థ్ ఇద్దరూ ఓ పడవ పై కూర్చొని సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు.
శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి అయిపోయింది.. పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసి వెళ్లిపోయాయి. ఇక ఫిబ్రవరికి చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మరో సినిమా కూడా చేరిపోయింది. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి
టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా షూటింగ్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు చాలామంది షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. గతకొద్ది రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్భంగా శర్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.
"మహాసముద్రం " మూవీ థీమ్ పోస్టర్ రిలీజ్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా యాక్షన్ ఎంటర్ టౌనర్ "మహాసముద్రం "మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. 7 సంవత్సరాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ కావడం విశేషం. అదితి రావు హైదరీ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
కొత్త లుక్ లో అదరగొడుతున్న శర్వా
ఈ మధ్య మన హీరోలు కొత్త కొత్త మేకోవర్ లు ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు ఈ లాక్ డౌన్ లు బాగా ఉపయోగించుకొని సిక్స్ ప్యాక్స్ కూడా చేసేసారు. అంతేకాదు సినిమా సినిమాకు తాము కొత్తగా ఉండటానికి తమ ప్రయత్నం తాము చేస్తూనే వుంటారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోడు. ఐతే మొదటిసారిగా శర్వా కూడా స్టైలిష్ లుక్ లోకి వచ్చాడు. అంతేకాదు తన ఫోటోలని అభిమానులతో పంచుకోగా సూపర్ లుక్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఫోటోల్లో శర్వానంద్ చాలా స్టైలిష్, కూల్ గా కనిపిస్తున్నాడు. ట్రీండీ గెటప్ లో చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు.
మొదలైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా హీరో, హీరోయిన్‌పై ముహూర్తం షాట్‌ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్ కొట్టారు. అనగాని సత్యప్రసాద్, ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.ఈ సందర్భంగా చిత్రయూనిట్ మాట్లాడుతూ.. ‘వినూత్నమైన…
శర్వా 'శ్రీకారం' - 20 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి
కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి గత కొద్దిరోజులుగా చిత్రీకరణలో ఉన్నారు. కరోనా జాగ్రత్త లతో తిరుపతి పరిసర ప్రాంతాలలో 20 రోజులుగా నాన్ స్టాఫ్ గా షూటింగ్ లోనే ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పుడు తాజాగా ఈ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.