టాలీవుడ్ చాలా వరకూ యంగ్ హీరోలు అందరూ వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. గత రెండు మూడేళ్ల కాలంలోనే చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా ఇంకొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ఉన్నారు. అందులో శర్వానంద్ పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా శర్వానంద్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే ఎంగేజ్ మెంట్ అయి ఐదు నెలలు అవుతున్నాఇప్పటివరకూ పెళ్లి గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈగ్యాప్ లో పెళ్లి గురించి ఎలాంటి టాపిక్ లేకపోవడంతో ఆగిపోయిందన్న వార్తలు కూడా రూమర్స్ కూడా తెరపైకి వచ్చాయి. అయితే అలాంటిది ఏం లేదని అవి కేవలం రూమర్స్ మాత్రమే అంటూ శర్వా టీం క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు శర్వా పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. పెళ్లి డేట్ తో పాటు వేదికను కూడా ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జనవరి 2, 3వ తేదీల్లో రాజస్థాన్ లోని జైపూర్ లోని శ్రీలీల ప్యాలెస్ లో శర్వానంద్ వివాహం జరగనుంది.
ఇక శర్వా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శర్వానంద్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు శర్వా. రీసెంట్ గానే 40 రోజుల పాటు లండన్ లో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: