కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా.. కావ్య థాపర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏక్ మినీ కథ. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈసినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించింది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమా టీజర్, ట్రైలర్ లతోనే ఈసినిమా అంచనాలు పెంచేసింది. ఇక బ్రహ్మాజీ, హర్షవర్ధన్, సుదర్శన్, పోసాని, శ్రద్ధాదాస్, సప్తగిరి తదితరులు నటించిన ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో నేడు రిలీజ్ అవ్వగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను చూసి యూనిక్ కాన్సెప్ట్ అంటూ రామ్ చరణ్ కితాబివ్వగా.. ఇప్పుడు చరణ్ అత్యంత సన్నిహితుడు.. బెస్ట్ ఫ్రెండ్ అయిన శర్వానంద్ కూడా ప్రశంసలు కురిపించాడు. ఏక్ మినీ కథ చూశాను.. యూనిక్ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది.. ఎవరూ తీసుకోలేని సబ్జెక్ట్ తీసుకున్నందుకు మేకర్స్ కు హ్యాట్సాఫ్.. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అని పొగిడేశాడు.
Watched #EkMiniKatha. It has a fresh feel with a unique concept. Kudos to the makers for picking an unusual subject. It’s a perfect laugh riot 😂
Watch #EkMiniKathaOnPrime here : https://t.co/5Ivb14jgXU
— Sharwanand (@ImSharwanand) May 27, 2021
ప్రస్తుతం శర్వా మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో సిద్దార్థ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: