సూపర్ హిట్ “RX 100 “మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం “మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాషలలో “ఒకే ఒక జీవితం “, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీస్ తెరకెక్కుతున్నాయి. హీరో శర్వానంద్ ప్రస్తుతం “ఆడవాళ్ళు మీకు జోహార్లు ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు ఒక టైమ్ ట్రావెల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ హీరోలు ఈ జానర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా టైమ్ మిషన్ నేపథ్యం లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ “ఆదిత్య 369 “మూవీ ఘనవిజయం సాధించింది. “ఆదిత్య 369 “మూవీ సీక్వెల్ ను తన తనయుడు మోక్షజ్ఞ తో హీరో బాలకృష్ణ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K “వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. శర్వానంద్ హీరోగా తెరకెక్కే సైన్స్ ఫిక్షన్ మూవీ ఐడియా డిఫరెంట్ గానూ , ఫ్రెష్ గానూ ఉంది. శర్వానంద్ , అతని ఫ్రెండ్స్ టైమ్ ట్రావెల్ మిషన్ ద్వారా చైల్డ్ హుడ్ కాలానికి వెళ్ళడం , తమ స్టూడెంట్ డేస్ , ఫ్రెండ్స్ , ఫ్రెండ్ షిప్స్ , లవ్ ఇంటరెస్ట్స్ వంటి వాటితో ఈ మూవీ ఆసక్తికరంగా సాగుతుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: