కొత్త లుక్ లో అదరగొడుతున్న శర్వా

Sharwanand Looks Stylish and Ubercool In His Latest Stills Shared On Social Media

ఈ మధ్య మన హీరోలు కొత్త కొత్త మేకోవర్ లు ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు ఈ లాక్ డౌన్ లు బాగా ఉపయోగించుకొని సిక్స్ ప్యాక్స్ కూడా చేసేసారు. అంతేకాదు సినిమా సినిమాకు తాము కొత్తగా ఉండటానికి తమ ప్రయత్నం తాము చేస్తూనే వుంటారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మాత్రం ఇలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోడు. ఐతే మొదటిసారిగా శర్వా కూడా స్టైలిష్ లుక్ లోకి వచ్చాడు. అంతేకాదు తన ఫోటోలని అభిమానులతో పంచుకోగా సూపర్ లుక్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఫోటోల్లో శర్వానంద్ చాలా స్టైలిష్, కూల్ గా కనిపిస్తున్నాడు. ట్రీండీ గెటప్ లో చూడగానే ఆకర్షించేలా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈరోజుతో అక్కడ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. దీనితో ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

ఇక ఈ సినిమాతో పాటు నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకార్తీక్ డైరెక్ట్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ పెట్టని తెలుగు, తమిళ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం చెన్నైలో జ‌రుగుతోంది.

వీటితో పాటు నేను శైల‌జ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈసినిమా షూటింగ్ తిరుపతిలో ప్రారంభమైంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + three =