కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Sharwanand

ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

శర్వా కొత్త ప్రాజెక్ట్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'

సినిమా థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయకపోయినా ... సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నా మన హీరోలు మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక కూడా వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మ‌హాస‌ముద్రం'లో అను ఇమ్మాన్యుయేల్‌

అజయ్ భూపతి దర్శకత్వంలో విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'మ‌హాస‌ముద్రం'. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్ట్రెస్‌ అదితి రావ్ హైద‌రిని ఎంపిక చేసినట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అందాల తార అను ఇమ్మాన్యుయేల్‌ను మ‌రో హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఆమెది కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రగా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Aditi Rao Hydari To Play The Female Lead In Ajay Bhupathi Maha Samudram
సినిమా వార్తలు

"మహా సముద్రం " మూవీ లో అదితిరావు హైదరి

సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం " రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్దార్ద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం " మూవీలో హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫామ్ 'మహా సముద్రం'లో అదితి

అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. సినిమాతో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రలో శర్వా నటించబోతున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో పడిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందికి గురి అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. సుమారు 6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యి చిత్ర పరిశ్రమ కళ కళ లాడుతుంది. కరోనా టైమ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ రీ ఓపెనింగ్ తో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

శర్వా ద్విభాషా చిత్రం షూటింగ్ పునఃప్రారంభం

టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. దాదాపు చాలా మంది ఇప్పటికే కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ అయితే ఏకంగా ఇటలీకి పయనమయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా శర్వా కూడా షూట్ ను స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"మహాసముద్రం " మూవీ లో హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్

సూపర్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి ఆ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ మూవీ తరువాత అజయ్ భూపతి ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "మహాసముద్రం " ను రూపొందించనున్నారు. ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా "మహాసముద్రం " మూవీ రూపొందనుంది . ఈ మూవీ లో హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్ 'మ‌హాస‌ముద్రం' లో సిద్ధార్థ్ - ఏడేళ్ల‌ తర్వాత

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజ‌య్ భూప‌తి డైరెక్షన్ లో రానున్న 'మహాసముద్రం' సినిమాపై ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ నటుడు శ‌ర్వానంద్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మరో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు దీనిపై కూడా అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

TFN Adminవాట్సాప్
Aishwarya Rajesh To Pair With Sharwanand In Ajay Bhupathi Mahasamudram
సినిమా వార్తలు

హీరో శర్వానంద్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ?

ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం "మూవీ రూపొందనుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ మూవీ లో హీరో శర్వానంద్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని, కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్ ప్రస్తుతం రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫైనల్లీ వచ్చేసిన 'మహాసముద్రం' అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఫైనల్లీ మహాసముద్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. అయితే ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గ‌మ్యం’ చిత్రాల త‌ర్వాత శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్రను చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు అని ట్వీట్ లో…

TFN Adminవాట్సాప్
Sharwanand Sreekaram Movie Team Releases An Interesting Update.
సినిమా వార్తలు

శర్వానంద్ "శ్రీకారం " మూవీ అప్ డేట్

"గమ్యం ", "రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి ", "మహానుభావుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శర్వానంద్ ప్రస్తుతం "శ్రీకారం "మూవీ లో నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యంలో "శ్రీకారం " మూవీ తెరకెక్కుతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడు 'పాయల్'.. ఇప్పుడు 'శర్వా'..!

మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 మూవీతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటివరకూ మరే సినిమాను డైరెక్ట్ చేయలేదు. మరోపక్క ఆర్ఎక్స్ 100లో నటించిన కార్తికేయ, పాయల్ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా తర్వాత మహాసముద్రం సినిమా అనుకున్నాడు. అయితే దానికి హీరో సెట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది అజయ్ భూపతికి. ఫైనల్ గా శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శర్వా' కొత్త సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌ మెంట్

ఈ ఏడాది 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. అయితే ఆ సినిమా అంత విజయం అందించలేకపోయింది. ఇక జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ‘శ్రీ‌కారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-త‌మిళ భాషలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్

షేర్