టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా షూటింగ్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు చాలామంది షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. గతకొద్ది రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్భంగా శర్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wrapped up #Sharwa30 shoot 😊 @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i
Directed by Shree Karthick
Music by @JxBe
Cinematography by Sujith Sarang
Dialogues by @TharunBhasckerD
Produced by @DreamWarriorpic @prabhu_sr pic.twitter.com/MNdQdUZRIn— Sharwanand (@ImSharwanand) November 24, 2020
కాగా రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై 2019లో ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీనితోపాటు ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ రైతు సమస్యల నేపథ్యం లో శ్రీకారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా ఇటీవలే తిరుపతిలో లాంగ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: