
ట్యాగ్ · 46 కథనాలు


'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్

'అంతఃపురం' ట్రైలర్ రిలీజ్

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్

"పుష్ప"ట్రైలర్ కు అనూహ్య స్పందన
'పుష్ప' ట్రైలర్ రిలీజ్

"మడ్డీ " మూవీ ట్రైలర్ రిలీజ్

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్

'అనుభవించు రాజా' ట్రైలర్ రిలీజ్

'అద్భుతం' ట్రైలర్ రిలీజ్

ఆర్ జి వి " లడ్కీ " మూవీ ట్రైలర్ రిలీజ్

'డేగల బాబ్జీ' ట్రైలర్ రిలీజ్

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్ రిలీజ్

"ఆశ ఎన్కౌంటర్"మూవీ ట్రైలర్ రిలీజ్
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్

సుమంత్ 'మళ్ళీ మొదలైంది' ట్రైలర్ రిలీజ్

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్

'రొమాంటిక్' నుండి మరో ట్రైలర్ రిలీజ్

'ఇందువదన' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో వరుణ్ సందేశ్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎం శ్రీనివాసరాజు దర్శకత్వంలో వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న సినిమా ఇందువదన. ఈసినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తుంది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం.

'రాధేశ్యామ్' ట్రైలర్ రిలీజ్
బాహుబలి, సాహో లాంటి సినిమాల తరువాత ప్రభాస్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఈసినిమాతో మరోసారి లవర్ బాయ్ లా మారిపోయాడు ప్రభాస్. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ అనేక కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'అంతఃపురం' ట్రైలర్ రిలీజ్
సుందర్ సి. తమిళంలో 'అరణ్మనై' టైటిల్ తో వరుస సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ 'అరణ్మనై1', 'అరణ్మనై2' సినిమాలు వచ్చాయి. తెలుగులో కళావతి, చంద్రకళ టైటిల్స్ తో ఈసినిమాలు రిలీజ్ అయ్యాయి. హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా 'అరణ్మనై 3' సినిమా కూడా వస్తుంది. ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'అంతఃపురం' టైటిల్ తో విడుదల అవుతుంది.

సోని అగర్వాల్ ‘డిటెక్టివ్ సత్యభామ’ ట్రైలర్ రిలీజ్
7జి బృందావన్ కాలనీ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన సోనీ అగర్వాల్ ఆసినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ మధ్య కాస్త సినిమాలకు గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తుంది. తాజాగా ఆమె డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్
ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలుసు. దానికితోడు ఆ సినిమా తీసేది రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. ఫైనల్ గా దాదాపు మూడేళ్ల తరువాత ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడుతుంది. మరికొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక మరోవైపు జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడన్న విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. ఏదో…

"పుష్ప"ట్రైలర్ కు అనూహ్య స్పందన
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ "పుష్ప" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే."పుష్ప " మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్…
'పుష్ప' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఇక బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా ప్రతి సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క బన్నీ-సుకుమార్ కాంబినేషన్ కారణమైతే.. మరోపక్క ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్లు విడుదల చేసిన చిత్రయూనిట్ నిన్న మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తే అది కూడా మంచి…

"మడ్డీ " మూవీ ట్రైలర్ రిలీజ్
ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ గా పాన్ ఇండియా మూవీ గా “మడ్డీ “మూవీ తెరకెక్కింది. పి కె 7 క్రియేషన్స్ బ్యానర్ పై రోడ్ రేసింగ్ లో అనుభవం ఉన్న ప్రభగల్ దర్శకత్వంలో యువన్ , రిథాన్ కృష్ణ , అనూష సురేష్ , అమిత్ శివదాస్ నాయర్ ప్రధానపాత్రలలో మడ్ రేసింగ్ నేపథ్యం లో తెరకెక్కిన “మడ్డీ ” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందించారు. తెలుగు భాషలో “మడ్డీ “మూవీని శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ ద్వారా మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీగా రిలీజ్ చేస్తున్నారు.

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన నాగశౌర్య ఇప్పుడు లక్ష్య అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమాలో నాగశౌర్య మేకోవర్ కూడా సినిమాపై మంచి క్రేజ్ ను పెంచేసింది. ఇక ఈసినిమా డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో జిబీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ ను…

'అనుభవించు రాజా' ట్రైలర్ రిలీజ్
శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా అనుభవించు రాజా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కిస్తున్నట్టు అర్థమవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి.

'అద్భుతం' ట్రైలర్ రిలీజ్
మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ... తేజ సజ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా అద్భుతం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్ధమయింది. అయితే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఆర్ జి వి " లడ్కీ " మూవీ ట్రైలర్ రిలీజ్
ఆర్ట్సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధానపాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో "లడ్కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" హిందీ మూవీ తెరకెక్కుతుంది. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువతిగా పూజా భలేకర్ ఓ వైపు యాక్షన్ పార్టుతో అదరగొడుతూనే మరోవైపు అందాలను ఆరబోస్తుంది. "లడ్కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" మూవీ హిందీతోపాటు చైనీస్ భాషలో విడుదల కానుంది.

'డేగల బాబ్జీ' ట్రైలర్ రిలీజ్
గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.

'స్కైలాబ్' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి ఇప్పుడు హీరోగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే మొత్తానికి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా తిమ్మరుసు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తన ఖాతాలో ఉన్న సినిమాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అందులో స్కైలాబ్ సినిమా కూడా ఉంది. విశ్వక్ కందేరావు దర్శకత్వంలో సత్యదేవ్ , నిత్య మీనన్ , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సినిమా స్కైలాబ్.

దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కురుప్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ షో సినిమా రాగా.. ఇప్పుడు వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా నవంబర్ 12 న ప్రేక్షకులముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

"ఆశ ఎన్కౌంటర్"మూవీ ట్రైలర్ రిలీజ్
అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో సోనియా ఆకుల , శ్రీకాంత్ అయ్యంగార్ , ప్రవీణ్ రాజ్ ప్రధాన పాత్రలలో తెలంగాణ లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటన, ఆపై ఎన్ కౌంటర్ ను ఆధారంగా తెరకెక్కిన "దిశ ఎన్కౌంటర్" మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. డి ఎస్ ఆర్ సంగీతం అందించారు. మూవీ టైటిల్ పై అభ్యంతరాలు రావడం తో టైటిల్ ను "ఆశ ఎన్కౌంటర్" గా మార్చారు.
'పుష్పక విమానం' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "పుష్పక విమానం". ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నవంబర్ 12న ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సుమంత్ 'మళ్ళీ మొదలైంది' ట్రైలర్ రిలీజ్
హీరో సుమంత్ ఈమధ్య స్పీడు పెంచాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మరో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈమధ్య ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

'రొమాంటిక్' నుండి మరో ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. అనిల్ పాడూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడు పెంచారు. ఒకపక్క పూరీ లైగర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా తనయుడి కోసం ప్రమోషన్స్ కోసం తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ లో క్రైమ్ యాంగిల్స్ ను చూపించారు.