సోని అగర్వాల్‌ ‘డిటెక్టివ్‌ సత్యభామ’ ట్రైలర్‌ రిలీజ్

Sonia Aggarwal Starrer Detective Sathyabhama Movie Trailer Is Out Now,Detective Satya Bhama,Detective Sathyabhama Movie Trailer,Sonia Aggarwal,Ravi Varma,Kumar Sai,Telugu FilmNagar,Mango Music,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,New Telugu Movies 2021,New Telugu Trailers 2021,Navaneeth Chary,Sonia Aggarwal Movie,Sonia Aggarwal New Movie,Sonia Aggarwal Movies,Sonia Aggarwal New Movie Trailer,Sonia Aggarwal Latest Movie Trailer,Sonia Aggarwal Latest Movie,Sonia Aggarwal Next Movie,Sonia Aggarwal Upcoming Movie,Detective Sathyabhama Sonia Aggarwal,Sonia Aggarwal Detective Sathyabhama,Sonia Aggarwal Detective Sathyabhama Movie,Sonia Aggarwal Detective Sathyabhama Trailer,Sonia Aggarwal Detective Sathyabhama Movie Trailer,Detective Sathyabhama Movie,Detective Sathyabhama Telugu Movie,Detective Sathyabhama Trailer,Detective Sathyabhama Telugu Movie Trailer,Detective Sathyabhama Official Trailer,Detective Sathyabhama Movie Songs,Detective Sathyabhama Trailer Launch,Detective Sathyabhama New Telugu Movie,Ravi Varma,Ravi Varma Movies,Ravi Varma New Movie,Ravi Varma Detective Sathyabhama,Telugu Movies,Detective Sathyabhama Trailer Telugu,Detective Sathyabhama Telugu Trailer,#DetectiveSatyaBhama,#DetectiveSathyabhamaTrailer,#SoniaAggarwal,#RaviVarma

7జి బృందావన్‌ కాలనీ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సోనీ అగర్వాల్‌ ఆసినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే ఈ మధ్య కాస్త సినిమాలకు గ్యాప్ వచ్చినా ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి వస్తుంది. తాజాగా ఆమె డిటెక్టివ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ లాబ్స్‌లో విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలించాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌ హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ట్రైలర్‌ చూస్తుంటే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్‌ని ప్రధాన పాత్రకు ఎంచుకోవటంలోనే సగం సక్సెస్‌ సాధించారు. సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం. ఎంత కొత్త టాలెంట్‌ వచ్చినా తనలో కలుపుకుంటుంది. నిర్మాత శ్రీశైలం గారు మా టీఎఫ్‌సీసీ మెంబర్‌. దర్శకుడు నవనీత్‌ చారి కూడా మల్టీటాలెంటెడ్‌. సిరాజ్‌ గారి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుండటం నిర్మాతకు బాగా హెల్ప్‌ అవుతుంది అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ అన్న బేధం లేకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్‌ లాగా కలిసి పోయాం. ఒక ఇంట్లో శుభకార్యాన్ని అందరూ కలిసి ఎలా విజయవంతం చేస్తారో.. మేమందరం అలాగే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో మా కెమెరామెన్‌ లక్కీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడు నవనీత్‌ చారి గారు తక్కువ టైంలో అనుకున్న బడ్జెట్‌లో క్వాలిటీ సినిమా చేశారు. ఆయన వందల సినిమాలకు అనేక రంగాల్లో పనిచేయడం వల్లనే ఇది సాధ్యం అయింది. మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

దర్శకుడు నవనీత్‌ చారి మాట్లాడుతూ .. మంచి టెక్నీషియన్స్‌ టీంతో పనిచేశాం. సోనియా అగర్వాల్‌ గారు మా స్క్రిప్ట్‌ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్‌ హీరోయిన్‌ ఈ కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. నిర్మాత గారు ఎప్పుడూ టెన్షన్‌ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్‌ చేసి షూటింగ్‌ సమయానికి అన్నీ అరేంజ్‌ చేశారు. ఇలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

మాటల రచయిత భాషాశ్రీ మాట్లాడుతూ .. దర్శకుడు నాకు చాలా కాలంగా మిత్రుడు దాదాపు 400 సినిమాలకు వివిధ డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేశాడు. ఆ అనుభవంతో మెగాఫోన్‌ పట్టుకున్నారు. మంచి కంటెంట్‌ ఉన్న సినిమా ఇది. తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు.

టీఎఫ్‌సీసీ డైరెక్టర్స్‌ వింగ్‌ జాయింట్‌ సెక్రటరీ సిరాజ్‌ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడే దర్శకుడు అయితే సినిమా ఏ లెవల్‌లో ఉంటుందో నవనీత్‌ చారి గారు నిరూపించారు. డిటెక్టివ్‌ సబ్జెక్ట్‌లకు మినిమమ్‌ గ్యారెంటీ ఉంటుంది. నా శక్తి మేరకు థియేటర్స్‌ ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు.

ఇంకా ఈసినిమాలో సోనియా అగర్వాల్‌ తో పాటు సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్‌, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్‌, భరత్‌ తదితరులు నటిస్తున్నారు. సిన్మా ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌పై నవనీత్‌ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =