టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’. ఇక బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా ప్రతి సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క బన్నీ-సుకుమార్ కాంబినేషన్ కారణమైతే.. మరోపక్క ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్లు విడుదల చేసిన చిత్రయూనిట్ నిన్న మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తే అది కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతోంది. బన్నీ ఇందులో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలన్నింటి కంటే భిన్నమైన పాత్ర ఇది. మొదటిసారి డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా సునీల్, అనసూయ కూడా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మరి ఇప్పటికే బాలయ్య-బోయపాటి అఖండ తో హ్యాట్రిక్ కొట్టారు. ఈనేపథ్యంలో ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి హ్యాట్రిక్ కొడతారో? లేదో? చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: