ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో తెలుసు. దానికితోడు ఆ సినిమా తీసేది రాజమౌళి లాంటి డైరెక్టర్ అయితే ఆ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఇంట్రెస్ట్ తోనే ఉన్నారు. ఫైనల్ గా దాదాపు మూడేళ్ల తరువాత ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడుతుంది. మరికొద్ది రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక మరోవైపు జక్కన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడన్న విషయం ఇప్పటికే అర్ధమైపోయింది. ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. దీనిలోభాగంగానే నేడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ విషయానికొస్తే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు హైలెట్ అన్న విషయం అర్ధమవుతుంది. భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా, తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదుర్కొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే అంటూ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తానికి మూడు నిమిషాల పైన నిడివి ఉన్న ఈ ట్రైలర్ తో రాజమౌళి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించాడు. దీంతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాడు.
Hope these 3 minutes and 7 seconds symbolise #RRRMovie in all its glory 🙂
Here’s #RRRTrailer https://t.co/bAGVAQXR8Q
See you in the theatres on 07.01.2022#BraceYourselvesForRRR #RRRMovie@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani
— rajamouli ss (@ssrajamouli) December 9, 2021
కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.