సుందర్ సి. తమిళంలో ‘అరణ్మనై’ టైటిల్ తో వరుస సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకూ ‘అరణ్మనై1’, ‘అరణ్మనై2’ సినిమాలు వచ్చాయి. తెలుగులో కళావతి, చంద్రకళ టైటిల్స్ తో ఈసినిమాలు రిలీజ్ అయ్యాయి. హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కాబట్టి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా ‘అరణ్మనై 3’ సినిమా కూడా వస్తుంది. ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ‘అంతఃపురం’ టైటిల్ తో విడుదల అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. హార్రర్ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి మరోసారి బాగానే భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతోందని అందరూ అంటున్నారు విశాలమ్మా.. ” అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఆ గది తలుపులు తెరిచిన దగ్గర నుంచే ఇలా జరుగుతోంది .. ఇంతకు అసలు ఆ గదిలో ఏముందని? అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: