తమ్ముడికి అండగా బరిలో దిగిన నాగబాబు

తన సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చూపడానికి రెడీ అయ్యాడు. సొంతగా జనసేన పార్టీ పెట్టి.. ప్రజారాజ్యం పార్టీలాగ కాకుండా తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ప్రత్యర్థులు పెద్దగా పట్టించుకోని పార్టీనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటేనే అర్దం చేసుకోవచ్చు పవన్ పార్టీ సాధించిన ప్రభంజనం ఏంటో. ఇదే జోరుతో రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీల పొత్తుతో ఎన్నికల బరిలో దిగనున్నాడు పవన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తమ్ముడికి అన్న కూడా తోడయ్యాడు. గత కొద్ది రోజులుగా తన వీడియోల ద్వారా జనసేన కు మద్దతు తెలుపుతూనే ఉన్నారు నాగబాబు. దాంతో ఆయన కూడా జనసేనలో చేరుతారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈరోజు నాగబాబు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ తన అన్నకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున నాగబాబు బరిలోకి దిగుతున్నారు. దీంతో నాగబాబు పార్టీ లో చేరడం.. అలాగే టికెట్ కూడా దక్కించుకోవడంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో… జనసేన వ్యూహాత్మకంగానే నాగబాబును ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుందన్నది జనసేన అంచనా. మరి చూద్దాం ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో..

[subscribe]

[youtube_video videoid=mlwwQsgxpQU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.