వరుస హిట్లతో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. లేడి ఒరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇటీవలే అంజలి సి.బి.ఐ సినిమాతో మంచి హిట్ అందుకున్న నయన్ ఇప్పుడు ఐరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డార్క్ కలర్ తో నయనతార ఈ సినిమాలో మరో ప్రయోగం చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తమిళనాట ‘లక్ష్మీ’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మంచి పేరు సంపాదించుకున్న కేఎమ్ సర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సుదర్శన్, సుందరామ్మూర్తి, రవీంద్రన్, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో కూడా నయన్ మరో హిట్ కొడుతుందేమో చూద్దాం.
ఇదిలా ఉండగా ఈ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా…నరసింహారెడ్డి’ మూవీలో నయన్ మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు విజయ్ హీరోగా రూపొందనున్న సినిమాలో, శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=quW7iol3sYE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: