`దేవదాస్` తరువాత మరో తెలుగు చిత్రం చేయని కింగ్ నాగార్జున… అతి త్వరలో రెండు చిత్రాలను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ రెండు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావడం విశేషం. అందులో ఒకటి `మన్మథుడు` (2002)కి సీక్వెల్ కాగా… మరొకటి `సోగ్గాడే చిన్ని నాయనా` (2016)కి కొనసాగింపు చిత్రం. ఈ రెండు సినిమాలను కూడా నాగార్జున స్వయంగా నిర్మించనున్నాడు. ఇదిలా ఉంటే… మరో సీక్వెల్‌లోనూ నాగార్జున నటించబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `రాజు గారి గది` (2015) పేరుతో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రానికి కొనసాగింపుగా 2017లో నాగార్జున, సమంత ముఖ్య పాత్రల్లో `రాజు గారి గది 2` చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు ఓంకార్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా `రాజు గారి గది 3` రాబోతోందట. ఇందులో ప్రధాన పాత్రల్లో నాగార్జున, తమన్నా నటించబోతున్నారని సమాచారం. అదేగనుక నిజమైతే… `ఊపిరి` తరువాత నాగ్, తమ్మూ కాంబోలో వచ్చే మూవీ ఇదే అవుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=DujMbvZaBKs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























