ప్రస్తుతం తెలుగునాట మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. ఇప్పుడు ఇదే వరుసలో మరో ఆసక్తికరమైన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేరనుందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… 2017 జూలై 21న విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం `విక్రమ్ వేద`. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని పుష్కర్ – గాయత్రి తెరకెక్కించారు. ఐఎండిబిలో అత్యధిక రేటింగ్స్ అందుకున్న ఈ తమిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఈ రీమేక్‌లో సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే… ఒరిజనల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన పుష్కర్ – గాయత్రి తెలుగు రీమేక్‌ని కూడా రూపొందించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[youtube_video videoid=XvIk8MHMzOk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: