
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 70


మజిలీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

"బదాయి హో" హిందీ మూవీ దక్షిణాది భాషలలో రీమేక్

మన్మథుడు -2 మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

`చిత్రలహరి`లో సరికొత్త పాత్రలో...

రాజ్ తరుణ్‌కి జోడీగా మేఘా ఆకాష్?

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ సెన్సార్ పూర్తి

`వెంకీ మామ` తాజా షెడ్యూల్ ఎప్పుడంటే...

అఖిల్‌కి జోడీగా మహేష్ హీరోయిన్?

పేరు మార్చుకున్న మెగా హీరో

మరో భారీ ఆఫర్ కొట్టేసిన త్రిష

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న కీరవాణి కొడుకు

'చిత్రలహరి' నుండి ఫస్ట్ సింగిల్ ఔట్

త్వరలో రాబోతున్న సముద్రం టీజర్

గొప్ప మనసు చాటుకున్న మనోజ్

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ వాయిదా

భారతీయుడు 2 ఆలస్యం కావడానికి అసలు కారణం!
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అనుకుంటున్న దగ్గర నుండి షూటింగ్ విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమా ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్నట్టు జరగడం లేదు. దీంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక దానిపై స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదు షూటింగ్ జరుగుతుంది అంటూ పుకార్లను ఖండించారు.

మజిలీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా 'మజిలీ' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతు టూ షేడ్స్ లలో ముఖ్యంగా మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక పాటలకు కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. ముఖ్యంగా ప్రియతమా ప్రియతమా సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది.

"బదాయి హో" హిందీ మూవీ దక్షిణాది భాషలలో రీమేక్
జంగ్లీ పిక్చర్స్, క్రోమ్ పిక్చర్స్ బ్యానర్స్ పై అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం లో రూపొందిన కామెడీ డ్రామా "బదాయి హో" హిందీ మూవీఘన విజయం సాధించి 200క్రోర్స్ క్లబ్ లో చేరింది. ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గిరిజారావు, సురేఖ సిక్రి నటించిన "బదాయి హో" హిందీ మూవీ చిన్న చిత్రం గా రూపొంది పెద్ద మూవీ గా అవతరించింది. "బదాయి హో" హిందీ మూవీ దక్షిణాది భాషల రీమేక్ రైట్స్ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు.

మన్మథుడు -2 మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున, సోనాలి బెంద్రే జంటగా K విజయ భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మన్మథుడు మూవీ 2002 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున హీరోగా మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు -2 మూవీ, చి ల సౌ వంటి ఫీల్ గుడ్ మూవీ ని రూపొందించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రూపొందనుంది.

`చిత్రలహరి`లో సరికొత్త పాత్రలో...
రచయితగానూ, దర్శకుడిగానూ, నటుడిగానూ... తెలుగు పరిశ్రమలో తనదైన సంతకం చేశాడు పోసాని కృష్ణమురళి. దాదాపు పాతికేళ్ళుగా వెండితెరపై పలు విభిన్న పాత్రల్లో అలరించిన పోసాని... ఎక్కువగా లౌడ్ కామెడీ రోల్స్ లోనే సందడి చేశాడు. అయితే... ఇందుకు భిన్నంగా పూర్తిస్థాయి శాంతపరుడి పాత్రలో ఆయన కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్.

రాజ్ తరుణ్‌కి జోడీగా మేఘా ఆకాష్?
`లై` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాష్. ఆ తరువాత `ఛల్ మోహన్ రంగ`లోనూ కనువిందు చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ నితిన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు తెలుగు చిత్రాల్లోనూ సోలో హీరోయిన్‌గా నటించిన మేఘకి... చాన్నాళ్ళ తరువాత తెలుగు పరిశ్రమ నుంచి మరో అవకాశం దక్కిందని సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రభాస్ పిరియాడికల్ లవ్ స్టోరీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `సాహో`, `జాన్` (ప్రచారంలో ఉన్న పేరు). ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా త్రిభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న `సాహో` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ సెన్సార్ పూర్తి
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా సంతోష్ P జయకుమార్ దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ హారర్ కామెడీ మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడు మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది. బాలమురళి బాలు సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు తమిళ మూవీ కి తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు .

`వెంకీ మామ` తాజా షెడ్యూల్ ఎప్పుడంటే...
`ఎఫ్ 2` ఘనవిజయం సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో `వెంకీ మామ` పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. `పవర్`, `సర్ధార్ గబ్బర్ సింగ్`, `జై లవ కుశ` చిత్రాల దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా... నాగచైతన్యకి జంటగా రాశి ఖన్నా కనిపించనుంది. యువ సంగీత సంచలనం తమన్ సంగీతమందిస్తున్నాడు.

అఖిల్‌కి జోడీగా మహేష్ హీరోయిన్?
గత ఏడాది సంచలన విజయం సాధించిన `భరత్ అనే నేను`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కియరా అద్వాని. మొదటి తెలుగు సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన పర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుందీ ఉత్తరాది భామ. ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ`లోనూ తన గ్లామర్‌తో మురిపించింది కియరా. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న కియరా... అతి త్వరలో మరో తెలుగు సినిమాలో నటించబోతోందని టాలీవుడ్ టాక్.

తెలుగులో కె.జి.ఎఫ్ షాకింగ్ కలెక్షన్స్
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కె.జి.ఎఫ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలార్ బంగారు గనుల నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా చాప్టర్ 1 కన్నడతో పాటుగా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేశారు. నిజానికి కన్నడలో 50 కోట్ల వసూళ్లు రావడమే కష్టం అలాంటిది.. కె.జి.ఎఫ్ ఏకంగా 250 కోట్లను వసూళు చేసి ఓ పెద్ద రికార్డే క్రియేట్ చేసింది.

పేరు మార్చుకున్న మెగా హీరో
పైన టైటిల్ ను చూసిన వెంటనే.. అదేంటీ మెగా హీరో పేరు మార్చుకున్నాడా..? ఇంతకీ ఏం పేరు మార్చుకున్నాడబ్బా..? ఈ పేరు బానే ఉంది కదా.. ఎందుకు మార్చుకున్నాడు? ఇలా డౌట్ల మీద డౌట్లు వచ్చే ఉంటాయి. అవును నిజంగానే సాయి థరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. అయితే కొత్త పేరు ఏం పెట్టుకోలేదు కానీ... తనకు ఉన్న పేరునే కాస్త షార్ట్ చేసుకొని మార్చుకున్నాడు. ఇన్ని రోజులు సాయి థరమ్ తేజ్ అని ఉండగా..ఇప్పుడు సాయి తేజ్ గా మార్చుకున్నాడు. ఈ విషయం ఈ రోజు తాను నటించిన చిత్రలహరి సినిమాలోని పరుగు పరుగు పాటను రిలీజ్ చేయగా..అందులో ఉన్న పేరును చూసి అర్ధమైంది. సో ఇక నుండి సాయి థరమ్ తేజ్ కాదు.. సాయి తేజ్ అని పిలవాలన్నమాట.

మరో భారీ ఆఫర్ కొట్టేసిన త్రిష
కొంత కాలం గ్యాప్ తరువాత వచ్చిన 96 సినిమాతో చెన్నై బ్యూటీ త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. 96 మంచి విజయం సాధించడంతో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలోనే మరో భారీ అఫర్ ను కొట్టేసింది త్రిష. ఇటీవల అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన బాలీవుడ్ మూవీ బద్లా మంచి టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో తాప్సీ ఖాతాలో మరో హిట్ వచ్చింది. ఓ హత్య కేసులో తాప్సీ ఇరుక్కోగా.. దానిని చేధించడానికి లాయర్ గా అమితాబ్ రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో…

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న కీరవాణి కొడుకు
తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది అనాది నుంది వస్తున్న సంప్రదాయమే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల కొడుకులు ఎంట్రీ ఇచ్చారు... వాళ్లు కూడా స్టార్ హీరోలయ్యారు.. సినీ పరిశ్రమను ఏలుతున్నారు. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈసారి దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీ నుండి కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆ హీరో ఎవరో కాదు రాజమౌళి అన్న, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు సింహా.

'చిత్రలహరి' నుండి ఫస్ట్ సింగిల్ ఔట్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'చిత్రలహరి'. ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ సినిమాతో తేజ్ కు హిట్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాడు. ఇక తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. పరుగు పరుగు అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

లాభాలు కురిపిస్తున్న 118 కలెక్షన్స్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయమవుతూ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా 2 వీక్స్ పూర్తి చేసుకుంది. రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈసినిమా... కలెక్షన్ల పరంగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కురిపిస్తోంది. మరి రెండు వారాలలో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

త్వరలో రాబోతున్న సముద్రం టీజర్
తెలుగు సినీ పరిశ్రమలో చాలానే మార్పులు వచ్చాయి. ఒకప్పటిలా కాకుండా.. ఇప్పుడు టాలెంట్ ఉన్న వారు ఎవరైనా సరే తమ టాలెంట్ ను చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో మంది చిన్న సినిమాల ద్వారా తమ సత్తా చాటి దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇదే కోవలో కొత్త నటీనటులతో.. చిన్న సినిమాగా సముద్రం అనే సినిమా రూపొందుతుంది.

గొప్ప మనసు చాటుకున్న మనోజ్
కేవలం సినిమా విషయాలే కాదు... సామజిక, రాజకీయ అంశాలపై కూడా మంచు మనోజ్ తన అభిప్రాయాలని ప్రజలతో పంచుకుంటుంటాడు. పలు విషయాలపై తన ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటారు. అంతేకాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూనే ఉంటాడు. అలాంటి మనోజ్ తాజాగా ఓ మంచి పని చేసి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ రోజు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు మనోజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి అందరికీ తెలిపాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ వాయిదా
A కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం లో ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రూపొందింది. ఎన్టీఆర్ జీవితం లో లక్ష్మీ పార్వతి పాత్ర, ఎన్టీఆర్ చివరి రోజులలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రవర్తన, చంద్ర బాబు నాయుడు వెన్నుపోటు వంటి వివాదా స్పద అంశాలతో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ లో విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ నటించారు.

మరోసారి దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాక్టర్ వర్కవుట్ అయ్యేనా?
`శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అయితే... ఆ తరువాత వచ్చిన `సవ్యసాచి`, `అమర్ అక్బర్ ఆంటొని` చిత్రాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో... ఈ బేనర్ నుంచి వస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ `చిత్రలహరి`పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల రూపొందిస్తున్న ఈ సినిమా... వేసవి కానుకగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.