క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితో సూర్య చిత్రం?

Suriya To Act With His Lucky Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Suriya Next Film With Director Bala,Hero Suriya New Movie With Director Bala,Suriya and Director Bala Combination Repeated Once Again,Suriya Next Project Update,Actor Suriya To Work With Director Bala
Suriya To Act With His Lucky Director

కోలీవుడ్ స్టార్ సూర్య‌కి తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. 1997లో విడుద‌లైన `నేరక్కు నేర్‌`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ స్టార్ కి… 2001లో వ‌చ్చిన `నంద‌` చిత్రం న‌టుడిగా మంచి గుర్తింపుని తీసుకువ‌చ్చింది. ఆ త‌రువాత 2005లో విడుద‌లైన `గ‌జిని` త‌మిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యి… సూర్య స్థాయిని పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `నంద‌`తో సూర్య కెరీర్‌ని మ‌లుపు తిప్పిన ద‌ర్శ‌కుడు బాలా… తాజాగా సూర్య‌ని సంప్ర‌దించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ చెప్పాడ‌ట‌. బాలా చెప్పిన ఇంటెన్స్ యాక్ష‌న్ స్టోరీ న‌చ్చ‌డంతో… సూర్య కూడా ఈ ప్రాజెక్ట్‌కి వెనువెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అంతేకాదు… పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ సిద్ధం చేయమ‌ని చెప్పాడ‌ట‌. దీంతో… సూర్య‌, బాలా కాంబినేష‌న్ క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్టేన‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యేమిటంటే… `నంద‌` త‌రువాత సూర్య‌, బాలా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `పితామ‌గ‌న్‌` (తెలుగులో `శివ‌పుత్రుడు`) కూడా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ రెండు చిత్రాల త‌రువాత సూర్య హీరోగా బాలా రూపొందిస్తున్న చిత్రం ఇదే కావ‌డం విశేషం. ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా సూర్య – బాలా కాంబో స‌క్సెస్‌ఫుల్ మూవీని అందిస్తుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=RfTNwFP6GeA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.