కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “ఎబిసిడి”

2019 Latest Telugu Movie News, ABCD Movie Latest Updates, ABCD Movie New Release Date, Allu Sirish ABCD Movie Gets A New Release Date, Allu Sirish ABCD Movie Release Date, Allu Sirish New Movie Gets a New Release Date, Allu Sirish Upcoming Movie Gets a New Release Date, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

ఫైనల్లీ “ఎబిసిడి” సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ మాత్రం పలుమార్లు వాయిదా పడింది. ముందు మార్చి1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు… ఆ తరువాత మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా మార్చి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా నూతన దర్శకుడు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో అల్లు శిరీష్ సరసన ఈ సినిమాలో ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్‌ రుక్సర్‌ థిల్లాన్‌ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.

మరి మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో హిట్టయిన ఈ సినిమా తెలుగులో హిట్ అవుతుందో? లేదో? ఈ సినిమాతో అయినా అల్లు శిరిష్ కు హిట్ దక్కుతుందో?లేదో? తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=nJ9CdpScF_s]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =