ఎవడు తక్కువ కాదు టీజర్ కు ముహూర్తం ఫిక్స్

Evadu Thakkuva Kaadu Movie Teaser Releasing Today,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Evadu Thakkuva Kaadu Teaser Release Date,Evadu Thakkuva Kaadu Movie Latest Updates,Evadu Thakkuva Kaadu Movie Teaser Release Date Fixed,Evadu Thakkuva Kaadu Movie Teaser Date Announced,Evadu Thakkuva Kaadu Movie Teaser Latest News

విక్రమ్ సహిదేవ్ అంటే ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ… “రేసు గుర్రం” సినిమాలో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో అలాగే “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాలో అన్వర్ పాత్రలో నటించి మెప్పించిన నటుడు అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీలో అయితే క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషనల్ నటనతో అందరినీ ఫిదా చేసేశాడు విక్రమ్ సహిదేవ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాను హీరోగా “ఎవడు తక్కువ కాదు” (‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’) సినిమాలో నటిస్తున్నాడు. రఘు జయ దర్శకత్వంలో లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుంది. ఇక ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ కు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం ఎవడు తక్కువ కాదు సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.

కాగా యాక్ష‌న్‌తో పాటు టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న ఈసినిమాలో విక్రమ్ సహిదేవ్ కు జోడిగా ప్రియాంక జైన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో ఆర్కే, తార, మధు సూదన్, రఘు కారుమంచి తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=msJBVpEm2ZE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =