ఢీ`… మంచు విష్ణు కెరీర్లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు విష్ణు. ఆ తరువాత `దేనికైనా రెడీ`, `దూసుకెళ్తా` చిత్రాలతోనూ విజయాలు అందుకున్నాడు ఈ మంచు వారి కథానాయకుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `ఢీ` తరువాత అటు శ్రీను వైట్ల… ఇటు మంచు విష్ణు వేర్వేరు ప్రాజెక్ట్‌లతో బిజీ కావడంతో… వీరి కలయికలో మరో సినిమా రాలేదు. కాగా… పన్నెండేళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోందని కొన్నాళ్ళ క్రితం కథనాలు వచ్చాయి. అయితే… ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో… తాజాగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విష్ణు… దర్శనానంతరం ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. 12 ఏళ్ళ తరువాత శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నానని తెలిపాడు. మరి… ఈ సినిమా `ఢీ`కి సీక్వెల్‌గా వస్తుందా? లేదంటే కొత్త కథతో వస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా… మంచు విష్ణు తాజా చిత్రం `ఓటర్` వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=_Rlo9_p7Cgg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























