సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ‘సాహో’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈసినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షెడ్స్ ఆప్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వీడియోలు రిలీజ్ చేయగా అవి మిలయన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటితో పాటు జపనీస్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా ప్రభాస్, శ్రద్దా కపూర్ తో పాటు ఇంకా ఈసినిమాలో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15వ తేదీన `సాహో` విడుదలచేయనున్నారు.
మరి ‘బాహుబలి’ సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’ కావడంతో ఈసినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులే కాదు..ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=Z6WlMvYEc3Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: