తెలుగువారికి ప్రీతిపాత్రమైన పర్వదినం సంక్రాంతి. అందుకే… ఆ సీజన్‌లో వచ్చే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంటుంది. ఏవో ఒకటీఅరా సందర్భాలను మినహాయిస్తే… ప్రతీ సంక్రాంతికి అగ్ర కథానాయకుల సినిమాల సందడే ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది కూడా అలానే… `యన్.టి.ఆర్. కథానాయకుడు` (బాలకృష్ణ), `వినయ విధేయ రామ` (రామ్ చరణ్), `ఎఫ్ 2` (వెంకటేష్) చిత్రాల రూపంలో టాప్ హీరోల సినిమాలు కనువిందు చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఈ తరహా సందడి ఉంటుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే… 2020 సంక్రాంతికి బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్ కొత్త చిత్రాలు తెరపైకి వచ్చే అవకాశముందని టాక్. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించనున్న కొత్త చిత్రం జూలైలో పట్టాలెక్కి… ముగ్గుల పండక్కి తెరపైకి రాబోతోందని వినిపిస్తోంది. ఇక మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న క్రేజీ ప్రాజెక్ట్… జూన్‌లో మొదలై సంక్రాంతికి విడుదలయ్యే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అలాగే ప్రభాస్ పిరియాడిక్ లవ్ సాగా `జాన్` (ప్రచారంలో ఉన్న పేరు) కూడా పెద్ద పండగనే టార్గెట్ చేసుకుందని సమాచారం. మరి… ఈ త్రిముఖ పోటీలో ఏ సినిమాకి ఆదరణ దక్కుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది. అలాగే… ఏ చిత్రాలు చివరాఖరికి తెరపైకి వస్తాయో అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే. చూద్దాం… ఏం జరుగుతుందో?
[youtube_video videoid=uQ3btUzqyK0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: