కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్రలతో 2002లో వచ్చిన ‘మన్మథుడు’ ఎంత బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘మన్మథుడు 2’ తెరకెక్కుతుంది. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే..ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆతరువాత మళ్లీ పోర్చుగల్ లో మరో షెడ్యూల్ కు ప్రయాణం కానున్నారు. కాగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, పాయల్‌రాజ్‌పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాలో ఇంకా రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి తదితరులు నటిస్తున్నారు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతదర్శకుడుగా పని చేస్తున్నారు.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: