
ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 17

పెట్రో మాక్స్ మూవీ లో తమన్నా సెకండ్ లుక్
హన్సిక స్టైలిష్ లాయర్ లుక్
రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు
ఆద్య-సితార ఫ్రెండ్ షిప్ స్టోరీ
సాహో పై నాని ఇంట్రెస్టింగ్ ట్వీట్ - మన సినిమా

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వేడుక ముఖ్య అతిథి

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమిళ్ అర్జున్ రెడ్డి..!

'రాహు' ఫస్ట్ లుక్ రిలీజ్

కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్

‘వి’ కోసం నాని సిక్స్ ప్యాక్..!

విజయ్‌కి జోడీగా కియారా అద్వాని?

కుటుంబ సభ్యుల పేర్లతో నాగ్ స్క్రీన్ నేమ్స్

మరోసారి కరుణానిధిగా ప్రకాష్ రాజ్?

‘రాయల సింహా’గా బాలయ్య?

సాహో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

మందిరా బేడీ ఫస్ట్ లుక్ రిలీజ్
సాహో లో నటిస్తున్న వారి లుక్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే సాహో లో విలన్స్ గా నటిస్తున్న వారి లుక్స్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మందిరా బేడీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కల్కీ అనే పాత్రలో మందిరా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
పెట్రో మాక్స్ మూవీ లో తమన్నా సెకండ్ లుక్
ఈగిల్స్ ఐ బ్యానర్ పై రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న కామెడీ హారర్ పెట్రో మాక్స్ తమిళ మూవీసెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. యోగి బాబు, కాళి వెంకట్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహి V రాఘవ్ దర్శకత్వంలో తాప్సీ నటించిన ఆనందో బ్రహ్మ మూవీ విజయం సాధించింది. ఆనందో బ్రహ్మ మూవీతమిళ రీమేక్ పెట్రో మాక్స్ మూవీ. గిబ్రాన్ సంగీతం అందించారు.
సరిలేరు నీకెవ్వరూ అజయ్ సెంటిమెంట్ కలిసొస్తుందా..?
తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్.. డైరెక్టర్స్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని ఫాలో అవుతూనే ఉంటుంది.
హన్సిక స్టైలిష్ లాయర్ లుక్
నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్ పై G నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక జంటగా కామెడీ ఎంటర్ టైనర్ తెనాలి రామకృష్ణ BA BL మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఆచారి అమెరికా యాత్ర వంటి కామెడీ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి.
రౌడీ హీరో కు ఫిదా అవుతున్న యంగ్ హీరోయిన్లు
విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు. ఆ తరువాత వరుస హిట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక విజయ్ కు కేవలం యూత్ లోనే కాదు యంగ్ హీరోయిన్ల లో కూడా విజయ్ పై క్రేజ్ రోజు రోజు కు పెరిగిపోతుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది అని చెప్పిందంటే విజయ్ క్రేజ్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఆమే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని కూడా గతంలో…
ఆద్య-సితార ఫ్రెండ్ షిప్ స్టోరీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి ఆద్య అండ్ సితార అనే యూ ట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగా మొదటి ఎపిసోడ్ త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే గేమ్ ను ఆడగా ఇప్పుడు మరో కొత్త ఎపిసోడ్ తో వచ్చారు. ఈసారి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా.. తమ ఫ్రెండ్ షిప్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న నీటి సమస్యపై కూడా స్పందిస్తూ.. నీటిని వృధా చేయకుండా.. సేవ్ చేయాలని.. తమ జెనరేషన్ కి నీటి సమస్య లేకుండా చేయాలని చక్కని ఆలోచనతో సూచించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వారిద్దరి స్నేహం ఎలా మొదలైందో వారి మాటల ద్వారా మీరే వినండి. ఈ కింద లింక్…
the Joke of the Decade ఆర్జీవి సినిమాలో వివాదమే లేదట
రేపు అంటే ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటలకు తన తాజా "వివాదాల కాజా" కు ముహూర్తం పెట్టాడు వివాదాల వినోద ప్రియుడు రాంగోపాల్ వర్మ. ఈ మధ్య కొద్ది రోజుల పాటు తన శిష్యుడు పూరి జగన్నాథ్ కు వచ్చిన "ఇస్మార్ట్ శంకర్" హిట్ సెలబ్రేషన్స్ లో షామ్పెయిన్ తో స్నానం చేసి సేదతీరి కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగాడు రాంగోపాల్ వర్మ. తనదైన వివాదాల మసాలాను జాతికి అంకితం చేయటంలో ఇంత గ్యాప్ రావటం దేశ ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు అనుకున్నాడో ఏమో...?! ఆగస్టు 9 శ్రావణ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతి జనులకు "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అనే తన తాజా సినిమాలోని ఒక కమ్మని పాటను దృశ్య, శ్రవణ రూపంలో అందిస్తానని…
సాహో పై నాని ఇంట్రెస్టింగ్ ట్వీట్ - మన సినిమా
ప్రస్తుతం రాబోయే సినిమాల్లో పెద్ద సినిమా అవడం, బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా, భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ.. ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సాహో సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ కి మూడు వారాల టైం ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీ గా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి వరుసగా విల్లన్ లుక్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఊపిరాడకుండా చేస్తున్నారు. ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. ఆగస్ట్ 10వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

సాహో నుండి జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్ రిలీజ్
సాహో సినిమాలో విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమాలో నటిస్తున్న మరో విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ మరో భయంకరమైన విలన్ రోల్ లో చేస్తున్నాడు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వేడుక ముఖ్య అతిథి
ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా పేరుపొందిన దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర మూవీ (1913 )కి దర్శకత్వం వహించి నిర్మించారు. 1870 నుండి 1944 సంవత్సరం వరకు ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవల జ్ఞాపకార్ధం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ &బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను 1969 సంవత్సరం లో ప్రవేశపెట్టింది. నేషనల్ అవార్డ్స్ తో పాటు ఈ అవార్డ్ ను ప్రెజెంట్ చేస్తారు. 1969 సంవత్సరం లో జరిగిన 17వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో 10 సంవత్సరాల సినీ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణించిన, ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరుపొందిన…

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమిళ్ అర్జున్ రెడ్డి..!
విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల హిందీలో రీమేక్ అయి.. అక్కడ కూడా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. హిందీలో షాహిద్ కపూర్, కియారా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగాకూడా ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది.

'రాహు' ఫస్ట్ లుక్ రిలీజ్
కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో రాహు అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంకా ఈ సినిమా లో ఏవీఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లక్కరాజు సంగీతమందిస్తున్నారు. చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల దర్శకుడు శంకర్ S దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయిక గా ఎంపికైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ ఇండియన్ (భారతీయుడు ) మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ 2021 సంవత్సరం తమిళ ఉగాదికి రిలీజ్ కానుందని సమాచారం.

తక్కువ గ్యాప్‌లో మూడు చిత్రాలతో విజయ్ దేవరకొండ?
తాజాగా `డియర్ కామ్రేడ్`తో పలకరించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ... తక్కువ గ్యాప్‌లో మూడు చిత్రాలతో సందడి చేసే దిశగా అడుగులు వేస్తున్నాడని సమాచారం.

‘వి’ కోసం నాని సిక్స్ ప్యాక్..!
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.

విజయ్‌కి జోడీగా కియారా అద్వాని?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘భరత్ అనే నేను’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది సోయగం కియారా అద్వాని. ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టారర్ `వినయ విధేయ రామ`లోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం కియారా పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉంది. కాగా... సౌత్ ఇండియన్ ఫిలిమ్స్‌లో నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ బాలీవుడ్ బ్యూటీ... ఇప్పుడు కోలీవుడ్‌లోనూ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్.

కుటుంబ సభ్యుల పేర్లతో నాగ్ స్క్రీన్ నేమ్స్
టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా పెట్టుకుని పలు సినిమాలలో సందడి చేసారు. అయితే... ఈ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జునది ప్రత్యేక శైలి. ఎందుకంటే... తన వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్ పెట్టుకోవడమే కాకుండా... తండ్రి, కోడలు పేర్లతో కూడా సినిమాలు చేసాడు ఈ టాలీవుడ్ మన్మథుడు.

మరోసారి కరుణానిధిగా ప్రకాష్ రాజ్?
పలు విజయవంతమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి... ఆ పాత్రలకే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేయనున్నట్లు సమాచారం. అది కూడా 22 ఏళ్ళ క్రితం తను పోషించిన పాత్ర తరహాలోదే కావడం విశేషం.

‘రాయల సింహా’గా బాలయ్య?
‘జై సింహా’ తరువాత కథానాయకుడు నందమూరి బాలకృష్ణ – దర్శకుడు కె.యస్.రవికుమార్ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో... పోలీస్ ఆఫీసర్‌గానూ, గ్యాంగ్స్టర్గానూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాలయ్య కనిపించనున్నట్టు సమాచారం. బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నాయికలుగా నటించనున్నట్టు తెలుస్తోంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా... ఈ చిత్రానికి ఆ మధ్య ‘రూలర్’, ‘క్రాంతి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

సాహో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
UV క్రియేషన్స్, T- సిరీస్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా మేకర్స్ భారీ ఎత్తున మూవీ ప్రమోషన్స్ ను చేపట్టారు. హీరో ప్రభాస్ టూర్ షెడ్యూల్ ను నిర్మాతలు రూపొందించారు.