సాహో సినిమాలో విలన్ పాత్రలు పోషిస్తున్న వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను వరుసగా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమాలో నటిస్తున్న మరో విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ మరో భయంకరమైన విలన్ రోల్ లో చేస్తున్నాడు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాహో టీం ఇప్పటివరకు ఐదుగురు విలన్స్ ని పరిచయం చేశారు. మొదటగా నీల్ నితిన్ ముకేశ్,తరువాత అరుణ్ విజయ్,నిన్న ఛంకీ పాండే,మరియు లాల్ ఒకరి తరువాత ఒకరి ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు.మరి వీరిని చూస్తుంటేనే ప్రభాస్ సాహోలో ఏరేంజ్ యాక్షన్ చూపించనున్నాడో అర్థం అవుతుంది కదా.
మొత్తానికి సాహో టీమ్ ఫ్యాన్స్ కు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తుంది. నెల రోజుల కౌంట్ డౌన్ స్టార్ అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మురళీ శర్మ, వెన్నెల కిషోర్, మందిరా బేడీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈనెల 30న భారీగా విడుదల కానుంది.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: